ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ghulam Nabi Azad: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ గుబులు

ABN, First Publish Date - 2023-04-10T16:44:48+05:30

గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) వైఖరి కాంగ్రెస్ పార్టీకి(Congress party) మింగుడుపడటం లేదు.

Ghulam Nabi Azad
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (Democratic Progressive Azad Party) అధినేత గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) వైఖరి కాంగ్రెస్ పార్టీకి(Congress party) మింగుడుపడటం లేదు. ఆజాద్ ఆత్మకథ పేరిట రాసిన పుస్తకంలో రాసిన విషయలతో కలకలం రేపిన ఆయన తాజాగా జాతీయ మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలతో దుమారం రేపుతున్నారు. ముఖ్యంగా ఆయన రాహుల్ గాంధీపై(Rahul Gandhi) చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రాహుల్ విదేశాలకు వెళ్లినప్పుడల్లా కొందరు అవాంఛనీయ వ్యాపారవేత్తలతో(undesirable businessmen) కలిసేవారని గులాం నబీ ఆజాద్ చెప్పడం ప్రకంపనలు రేపుతోంది. ఆజాద్ వ్యాఖ్యలను బీజేపీ హైలైట్ చేసింది. ఆజాద్ చెబుతున్నట్లుగా రాహుల్ విదేశాల్లో కలిసిన అవాంఛనీయ వ్యాపారవేత్తలు ఎవరని బీజేపీ ప్రశ్నించింది. అసలు రాహుల్ అజెండా ఏంటని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ (BJP MP Ravi Shankar Prasad) ప్రశ్నించారు.

రాహుల్ విదేశీ పర్యటనలపైన, ఆయన విదేశాల్లో కలిసే వ్యక్తులపైన ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రోజురోజుకూ ఆజాద్ బీజేపీకి, మోదీకి మరింత సన్నిహితమౌతున్నారని ఎద్దేవా చేశారు. మోదీపై విధేయతను చాటేందుకు ఆజాద్ అనుసరిస్తున్న తీరు దయనీయంగా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ వ్యవహారాల ఇంఛార్జ్ జైరాం రమేశ్ ఆరోపించారు.

ఆజాద్ ఇటీవలే ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ అసలు సిసలైన రాజనీతిజ్ఞుడని కితాబిచ్చారు. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ, హిజాబ్ వివాదం ఇలా అన్ని అంశాల్లో విమర్శలు చేసినా, కొన్ని బిల్లులు ఆమోదం పొందకుండా చేసినా మోదీ ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోలేదని ఆజాద్ ప్రశంసించారు. బీజేపీకి దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారన్న కాంగ్రెస్ ఆరోపణలు చిన్నపిల్లల వ్యాఖ్యలని ఆజాద్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి సామాన్య ప్రజల్లో పట్టు లేదన్నారు. అయితే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దు(Disqualification of Rahul Gandhi as Lok Sabha MP) ను ఆజాద్ తప్పుబట్టారు. రాహుల్ గాంధీ అయినా, లాలూ ప్రసాద్ యాదవ్ అయినా లేదా ఏ ఎంపీ లేదా ఎమ్మెల్యే ఎవరైనా చివరి న్యాయస్థానం తేల్చేదాకా అనర్హత వేటు వేయరాదని ఆజాద్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యానికిది సరైనది కాదన్నారు. ఈ రకంగా అయితే మొత్తం అసెంబ్లీలు, పూర్తి పార్లమెంట్ ఖాళీ అయిపోతుందని ఆజాద్ చెప్పారు

ఆజాద్‌కు నాలుగు దశాబ్దాలకు మించి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఉభయసభల్లో ప్రతిపక్షనేతగా కూడా పనిచేశారు. ఈ మధ్యనే ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరు నచ్చక కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ స్థాపించారు.

2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీని మూడోసారి అధికారంలోకి రానీయకుండా నిలువరించాలని ప్రతిపక్షాలు ఐక్యపోరు సాగిస్తున్న వేళ గులాం నబీ ఆజాద్ వంటి దిగ్గజ రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్స్ దేశవ్యాప్తంగా కలకలం రేగి రాజకీయాల్లో కుదుపునకు కారణమౌతున్నాయి.

Sharad Pawar: శరద్ పవార్ వ్యూహాలతో కాంగ్రెస్‌లో కలకలం


BJP: 4 దశాబ్దాలుగా కమల వికాసం.. 2 నుంచి 303 దాకా.. మోదీని ఆపే మొనగాడే లేడా..!


Updated Date - 2023-04-10T17:09:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising