Digital india : భారత్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ గురించి సుందర్ పిచాయ్ ఎమన్నారో చెప్పిన కేంద్ర మంత్రి అనురాగ్
ABN , First Publish Date - 2023-05-16T12:07:55+05:30 IST
కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల విషయంలో మన దేశానికి, ఇతర దేశాలకు ఉన్న వ్యత్యాసాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ : కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల విషయంలో మన దేశానికి, ఇతర దేశాలకు ఉన్న వ్యత్యాసాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai) చెప్పారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ (Union Minister Anurag Thakur) తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు భారత దేశంలో పేదల ఫోన్లలో సైతం ఉంటున్నాయని, ఇతర దేశాలు ఈ విధంగా చేయలేకపోయాయని చెప్పారన్నారు.
అనురాగ్ ఠాకూర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు ప్రజల ఫోన్లలోని కోవిన్ యాప్ (Cowin app)లోనే అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు. ఇటువంటి సదుపాయం కేవలం భారత దేశంలో మాత్రమే ఉందన్నారు. ఇతర దేశాల్లో ఈ సదుపాయం లేదన్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఓసారి ఢిల్లీలో ఓ కార్యక్రమంలో తనను కలిశారని చెప్పారు. ఆయన తన కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కాగితాన్ని తన జేబులో నుంచి తీసి చూపించారన్నారు. ఈ వ్యాక్సిన్ సర్టిఫికేట్ హార్డ్ కాపీని తాను ఎక్కడికెళ్లినా తనతోపాటు తీసుకెళ్లవలసి వస్తోందని చెప్పారన్నారు. కానీ భారత దేశంలో పేదలకు సైతం వారి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు వారి ఫోన్లలోనే ఉంటున్నాయని చెప్పారని తెలిపారు. ఈ విధంగా ఏ దేశమూ చేయలేకపోయిందని చెప్పారని తెలిపారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను ఫోన్లలోనే అందుబాటులో ఉంచినందుకు మనం గర్వపడాలని చెప్పారు. డిజిటల్ పేమెంట్, డిజిటల్ సర్టిఫికేట్లను తమ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరి సలహాను స్వీకరిస్తారన్నారు. అధికారులు ఇచ్చిన సలహాను పాటించడం వల్ల ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు. అందుకే ప్రజలకు గ్యాస్ సిలిండర్లు, ఇళ్లు, నీటి కొళాయి కనెక్షన్లు ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. అవినీతిని సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి :
Karnataka CM Race : పెదవి కదపని సిద్ధరామయ్య
Karnataka CM Tussle : కాసేపట్లో ఢిల్లీకి డీకే శివ కుమార్