PM Modi: దోచుకున్న ప్రతి పైసా కక్కిస్తాం.. మోదీ ఘాటు ట్వీట్
ABN, First Publish Date - 2023-12-08T19:14:54+05:30
ప్రజల నుంచి లూటీ చేసిన ప్రతి పైసాను వెనక్కి రప్పిస్తామని, ఇది మోదీ గ్యారెంటీ అని 'ఎక్స్' వేదికపై మోదీ శుక్రవారంనాడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తన ట్వీట్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుతో సంబంధం ఉన్న ఒక వ్యాపార సంస్థకు చెందిన వేర్వేరు ప్రదేశాల నుంచి కోట్లాది రూపాయల నగదు ఐటీ దాడుల్లో పట్టుబడింది.
న్యూఢిల్లీ: ప్రజల నుంచి లూటీ చేసిన ప్రతి పైసాను వెనక్కి రప్పిస్తామని, ఇది మోదీ గ్యారెంటీ అని 'ఎక్స్' వేదికపై మోదీ శుక్రవారంనాడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తన ట్వీట్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుతో సంబంధం ఉన్న ఒక వ్యాపార సంస్థకు చెందిన వేర్వేరు ప్రదేశాల నుంచి కోట్లాది రూపాయల నగదు ఐటీ దాడుల్లో పట్టుబడింది. ఈ కథనాన్ని తన పోస్ట్‌కు మోదీ జత చేశారు. ఈ కరెన్సీ నోట్ల గుట్టలను దేశప్రజలంతా చూసిన తర్వాత ఆ పార్టీ నాయకుల నిజాయితీ, చెప్పే ఉపన్యాసాలు వినాలని, ప్రజల నుంచి లూటీ చేసిన ప్రతి పైసాను వాపలు చేయాల్సిందేనని, ఇది మోదీ గ్యారెంటీ అంటూ పలు ఇమోజీలతో మోదీ హెచ్చరించారు. బీరువాల నిండా నోట్ల కట్టలున్న ఒక కథనం కూడా ట్వీట్‌కు ఆయన జోడించారు.
ఒడిశా, జార్ఖండ్‌లలో ఐటీ శాఖ గురువారం జరిపిన పలు దాడుల్లో వివిధ మద్యం తయారీ సంస్థలకు చెందిన రూ.300 కోట్లు పట్టుబడ్డాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై బుధవారం నుంచి సుమారు అర డజనుకు పైగా సంస్థల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. కేవలం ఒడిశాలోని బౌద్ధ్, రాయడిహ్, సంబల్‌పూర్, బాలంగీర్ జిల్లాల్లోని బీడీపీఎల్ పర్మిసెస్, జార్ఖాండ్‌లోని రాంచీ, లోహర్‌డగ జిల్లాల్లో రూ.150 కోట్లు పట్టుబడినట్టు అధికారులు చెబుతున్నారు. బీడీపీఎఎల్ యజామానులతో సన్నిహత సంబంధాలున్నాయన్న కారణంగా కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటిపై కూడా అధికారులు దాడులు జరిపినట్టు సమాచారం. దాడులు జరిగిన కంపెనీలతో బీజపీ నేత జోగేష్ సిన్హాకు సంబంధాలున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే సుందర్‌గఢ్ కుసుమ్ టెటే ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను సిన్హా తోసిపుచ్చారు. డిస్ట్రలరీ యజమానులతో తనకు ప్యామిలీ పరమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు.
కాగా, ఇటీవల మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 'ఎక్స్' వేదకగా మోదీ తన యుద్ధాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రతిపక్షాల విచ్ఛినకర కుట్రలను తిప్పికొట్టారంటూ ఎన్నికల ఫలితాల అనంతరం మోదీ ట్వీట్ చేశారు.
Updated Date - 2023-12-08T19:14:56+05:30 IST