Governor: గవర్నర్‌కు నిరసన సెగ తగిలిందిగా..

ABN , First Publish Date - 2023-06-29T09:39:58+05:30 IST

చాలాకాలంగా యూనివర్శిటీల స్నాతకోత్సవాలను పెండింగ్‌లో పెట్టి, విద్యార్థుల సర్టిఫికెట్ల జాప్యానికి కారణమయ్యారంటూ రాష్ట్ర గవ

Governor: గవర్నర్‌కు నిరసన సెగ తగిలిందిగా..

- నల్లజెండాలు చూపిన విద్యార్థి సంఘాలు

పెరంబూర్‌(చెన్నై): చాలాకాలంగా యూనివర్శిటీల స్నాతకోత్సవాలను పెండింగ్‌లో పెట్టి, విద్యార్థుల సర్టిఫికెట్ల జాప్యానికి కారణమయ్యారంటూ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(State Governor RN Ravi)కి డీఎంకే మిత్రపక్షాల నుంచి నిరసన వ్యక్తమైంది. పెరియార్‌ యూనివర్శిటీ స్నాతకోత్సవం కోసం బుధవారం సేలం వెళ్లిన గవర్నర్‌కు డీఎంకే మిత్రపక్షాలు నల్లజెండాలతో నిరసన తెలిపాయి. పెరియార్‌ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి బుధవారం సేలం చేరుకున్నారు. విద్యార్థులకు డిగ్రీలు పంపిణీల జాప్యంచేస్తున్నారని, రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్‌ తీరు ఉందని, ముఖ్యమైన తీర్మానాలను ఆమోదించకుండా చెత్తబుట్టలో వేశారంటై పెరియార్‌ విశ్వవిద్యాలయానికి వెళ్లే మార్గం సమీపంలోని కరుప్పర్‌ ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల ఎదురుగా ద్రావిడర్‌ విడుదలై కళగం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శనలో, సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే, డీపీఐ, తమిళగ వాల్వురిమై కట్చి సహా పలు పార్టీల నేతలు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నేతలు గవర్నర్‌కు వ్యతిరేకంగా నల్ల జెండాలు చూపుతూ పాల్గొన్నారు. నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ద్రావిడర్‌ విడుదలై కళగం అధ్యక్షుడు కొళత్తూర్‌ మణిసహా 300మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మంత్రి పొన్ముడి గైర్హాజరు...

పెరియార్‌ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి(Minister Ponmudi) గైర్హాజరయ్యారు. చెన్నైలో ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన సమావేశంలో మంత్రి పొన్ముడి పాల్గొనడంతో, విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాలకు ఆయన హాజరుకాలేదని నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే గవర్నర్‌తో కలిసి పాల్గొనడం ఇష్టం లేకనే ఆయన ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

panfu2.jpg

పీఎంకే ఎమ్మెల్యేల బహిష్కరణ...

ఈ వేడుకల్లో శాసనసభ్యులకు సరైన సీటు వసతి కల్పించలేదని ఆరోపిస్తూ పీఎంకే ఎమ్మెల్యేలు అరుళ్‌, సదాశివం కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. వారిని సముదాయించేందుకు గవర్నర్‌ ప్రత్యేక భద్రతా అధికారి శాంతి చర్చించినా ఫలితం లేకపోయింది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-06-29T09:40:00+05:30 IST