Share News

High Court: ఆలయాలు రాజకీయ వేదికలు కావు

ABN , First Publish Date - 2023-10-15T08:00:42+05:30 IST

ఆలయాలు రాజకీయ వేదికలు కావని హైకోర్టు మదురై బెంచ్‌(High Court Madurai Bench) అభిప్రాయం వ్యక్తం చేసింది. తూత్తుకుడి జిల్లా తిరుచ్చెందూర్‌

High Court: ఆలయాలు రాజకీయ వేదికలు కావు

- హైకోర్టు మదురై బెంచ్‌

ప్యారీస్‌(చెన్నై): ఆలయాలు రాజకీయ వేదికలు కావని హైకోర్టు మదురై బెంచ్‌(High Court Madurai Bench) అభిప్రాయం వ్యక్తం చేసింది. తూత్తుకుడి జిల్లా తిరుచ్చెందూర్‌ సుబ్రమణ్యస్వామి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న జయ్‌ ఆనందన్‌, తిరుచ్చెందూర్‌ ఆలయంలో హిందూ దేవాదాయ శాఖ తరఫున చేపట్టిన జీర్ణోద్ధరణ పనులపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేయడంతో ఆయన్ను డిస్మిస్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిరి సవాలు చేస్తూ జయ్‌ ఆనందన్‌ హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో, తిరుచ్చెందూర్‌ ఆలయంలో తనను అర్చకుడిగా చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ శుక్రవారం న్యాయమూర్తి పుహళేంది సమక్షంలో విచారణకు రాగా ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది, సంబంధిత అర్చకుడు ఆలయంలో పనిచేస్తూనే హిందూ దేవాదాయ శాఖకు వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేశారని, అందువల్లే ఆయన్ను డిస్మిస్‌ చేసినట్లు వివరించారు. అర్చకవృత్తిలో ఉంటూ ఆలయానికి వ్యతిరేకంగా వ్యవహరిం చడం సరికాదని పేర్కొంటూ డిస్మిస్‌ ఉత్తర్వులు రద్దు చేయలేమని తెలిపారు

Updated Date - 2023-10-15T08:00:42+05:30 IST