ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rain Alert: భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవు!

ABN, First Publish Date - 2023-09-11T11:44:39+05:30

భారీ వర్షాల కారణంగా నేడు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు లక్నో జిల్లా మేజిస్ట్రేట్ సూర్య పాల్ గంగ్వార్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

లక్నో: భారీ వర్షాల కారణంగా నేడు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు లక్నో జిల్లా మేజిస్ట్రేట్ సూర్య పాల్ గంగ్వార్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. లక్నోలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఈ వర్షాలు సోమవారం కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని సోమవారం అన్ని పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్టు ఆ ప్రకటనలో గంగ్వార్ తెలిపారు. ఆదివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లక్నోలోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. సోమవారం కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.


మరోవైపు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్, పాలం విమానాశ్రయం, రాజ్‌ఘాట్, వసంత్ కుంజ్, మునిర్కా, నరేలాతో సహా పలు ఇతర ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రతికూల వాతావరణంలో ప్రభుత్వం జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను అనుసరించాలని తెలిపారు. కాగా గత నెలలో అత్యల్ప వర్షపాతం నమోదైన సంగతి తెలిసిందే. 1901 తర్వాత అత్యంత పొడి ఆగష్టు ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం రుతుపవనాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించడంతో ఈ నెలలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-09-11T11:44:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising