Hyderabad City: హైదరాబాద్ నగరంలో భారీవర్షం...రోడ్లు జలమయం

ABN , First Publish Date - 2023-04-29T06:58:11+05:30 IST

హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం భారీవర్షం కురిసింది....

Hyderabad City: హైదరాబాద్ నగరంలో భారీవర్షం...రోడ్లు జలమయం
Hyderabad City Heavy Rains

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం భారీవర్షం కురిసింది.(Heavy Rains) భారీవర్షం వల్ల నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై డ్రైనేజీ నీరు పొంగి ప్రవహించింది. హైదరాబాద్ నగరంలోని(Hyderabad City) బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో రోడ్లన్నీ నదులను తలపించాయి. తెలతెలవారుతుండగానే భారీవర్షం కురవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భారీవర్షంతో వరదనీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. నగరంలోని పలు లోతట్టుప్రాంతాలు నీటమునిగాయి.

Updated Date - 2023-04-29T06:58:24+05:30 IST