ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Gandhi : కాపీరైట్ వివాదం.. రాహుల్ గాంధీకి కర్ణాటక హైకోర్ట్ షాక్..

ABN, First Publish Date - 2023-06-29T11:08:17+05:30

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), జైరామ్ రమేశ్ (Jairam Ramesh), సుప్రియ శ్రినాటే (Supriya Shrinate) చిక్కుల్లో పడ్డారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సందర్భంగా కేజీఎఫ్-2 సినిమాలోని సంగీతాన్ని అనధికారికంగా ఉపయోగించుకున్నట్లు వీరిపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.

Congress leader Rahul Gandhi in Delhi's Karol Bagh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), జైరామ్ రమేశ్ (Jairam Ramesh), సుప్రియ శ్రినాటే (Supriya Shrinate) చిక్కుల్లో పడ్డారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సందర్భంగా కేజీఎఫ్-2 సినిమాలోని సంగీతాన్ని అనధికారికంగా ఉపయోగించుకున్నట్లు వీరిపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. అనుమతి లేకుండా సోర్స్ కోడ్‌ను ట్యాంపర్ చేసినట్లు కనిపిస్తోందని, ఇది నిస్సందేహంగా కంపెనీ కాపీరైట్‌‌ను ఉల్లంఘించడమవుతుందని తెలిపింది.

రాహుల్ గాంధీ 2022లో భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కన్నడ సినిమా కేజీఎఫ్-2లోని మ్యూజిక్‌ను అనధికారికంగా వాడుకున్నారని ఎంఆర్‌టీ మ్యూజిక్ ఫిర్యాదు చేసింది. ఈ సినిమాలోని పాటలతో రెండు వీడియోలను కాంగ్రెస్ విడుదల చేసిందని, దీనికి తమ అనుమతి లేదని తెలిపింది. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి, ఈ పాటల మ్యూజిక్‌ను కాంగ్రెస్ పార్టీ వాడుకుందని ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా రాహుల్ గాంధీ తదితరులపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాపీరైట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాలు, భారత శిక్షా స్మృతి ప్రకారం యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.

భారత్ జోడో యాత్ర 2022 సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యా కుమారి నుంచి ప్రారంభమైంది. దాదాపు 145 రోజులపాటు జరిగిన ఈ యాత్ర కశ్మీరులో ముగిసింది. రాహుల్ సుమారు 4 వేల కిలోమీటర్లు నడిచి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో మోటారు సైకిల్ మెకానిక్ దుకాణాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకున్నారు. ఈ ఫొటోలను ఆయన ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి :

Obama Vs Modi : బరాక్ ఒబామా ఓ ప్రైవేట్ వ్యక్తి : అమెరికా

Eid al-Adha : ఈద్ అల్-అదా పండుగ సందర్భంగా మోదీ శుభాకాంక్షలు

Updated Date - 2023-06-29T11:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising