Madurai: ఒకే సమయంలో అమ్మవారి ఆలయంలో మాజీసీఎం, ఎంపీ కనిమొళి

ABN , First Publish Date - 2023-08-31T07:45:41+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి(Palaniswami), డీఎంకే ఎంపీ కనిమొళి(

Madurai: ఒకే సమయంలో అమ్మవారి ఆలయంలో మాజీసీఎం, ఎంపీ కనిమొళి

- మదురైలో ఉత్కంఠ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి(Palaniswami), డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) బుధవారం ఒకే సమయంలో మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం కార్యకర్తల్లో ఉత్కంఠ రేపింది. మదురై(Madurai)లో ఈనెల 20వ తేది నిర్వహించిన మహానాడు విజయం కావడంతో, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) బుధవారం మదురై చేరుకొని మీనాక్షి అమ్మవారిని దర్శించుకొనేందుకు వెళ్లారు. ఆయన వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సెల్లూర్‌ రాజు, ఉదయ్‌కుమార్‌, ఎమ్మెల్యే రాజన్‌ చెల్లప్ప తదితరులున్నారు. ఈ నేపథ్యంలో, పార్లమెంటరీ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌, ఎంపీ కనిమొళి నేతృత్వంలోని బృందం మదురై జిల్లాలో పథకాల అమలు తీరును మంగళవారం నుంచి పరిశీలిస్తోంది. రెండో రోజైన బుధవారం ఈ బృందం మదురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లింది. పళనిస్వామి, కనిమొళి ఒకే సమయంలో ఆలయంలో ఉండడంతో, ఇద్దరూ ఎదురుపడతారేమో, అప్పుడు ఏం మాట్లాడుకుంటారంటూ ఇరువర్గాల కార్యకర్తలు గుసగుసలాడుకున్నారు. కానీ, ఇరువురూ వేర్వేరు ప్రాకారాల్లో వెళ్లడంతో ఈ ఉత్కంఠకు తెరపడినట్లయింది. సుమారు గంట సేపు ఆలయంలో గడిపిన అనంతరం తొలుత పళనిస్వామి, తరువాత కనిమొళి ఆలయం నుంచి వెలుపలికి వచ్చారు.

nani2.jpg

Updated Date - 2023-08-31T08:09:24+05:30 IST