Magna elephant: మళ్ళీ.. జనావాసాల్లో మగ్నా ఏనుగు

ABN , First Publish Date - 2023-02-22T11:07:39+05:30 IST

కొన్నేళ్ళకు ముందు ధర్మపురి జిల్లా పాలక్కోడు ప్రాంతంలో సంచరించి ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన మగ్నా ఏనుగు(Magna i

Magna elephant: మళ్ళీ.. జనావాసాల్లో మగ్నా ఏనుగు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కొన్నేళ్ళకు ముందు ధర్మపురి జిల్లా పాలక్కోడు ప్రాంతంలో సంచరించి ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన మగ్నా ఏనుగు(Magna is an elephant) మళ్ళీ అడవిని విడిచిపెట్టి జనావా సాల్లోకి వచ్చింది. మంగళవారం ఉదయం కోయంబత్తూరు(Coimbatore) జిల్లా పొల్లాచ్చి సమీపం సోత్తుమడై ప్రాంతం వద్ద ఆ మగ్నా ఏనుగు నడిచి వెళుతుండగా చూసి స్థానికులు బిత్తరపోయారు. మగ్నా ఏనుగు బీభత్సం సృష్టించినప్పుడు టాప్‌స్లిప్‌ నుంచి చిన్న తంబి అనే కుంకీ ఏనుగు సాయంతో దాన్ని అటవీ శాఖ అధికారులు మలైక్కాడు అటవీ ప్రాంతంలోకి తరలించారు. ఆ తర్వాత పొల్లాచ్చి సమీపం టాప్‌స్లిప్‌ వరకలియారు అటవీ ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత ఆ మగ్నా ఏనుగు కదలికలపై అటవీ శాఖ అధికారులు నిఘా వేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నల్లతుక్కకుళి, కాక్కాపుదూరు రహదారిలో ఆ మగ్నా ఏనుగు నెమ్మదిగా నడిచి వెళుతుండటాన్ని స్థానికులు చూసి భీతిల్లారు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-02-22T11:08:05+05:30 IST