ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Maha Congress : మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం మరికాసేపట్లో

ABN, First Publish Date - 2023-07-04T10:41:20+05:30

మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో సమావేశం కాబోతున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) కార్యదర్శి హెచ్‌కే పాటిల్ ఈ సమావేశానికి హాజరవుతారు. శాసన సభలో ప్రతిపక్ష నేత పదవిపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ ఈ పదవికి శుక్రవారం రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

Senior Congress leader Prithviraj Chavan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో సమావేశం కాబోతున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) కార్యదర్శి హెచ్‌కే పాటిల్ ఈ సమావేశానికి హాజరవుతారు. శాసన సభలో ప్రతిపక్ష నేత పదవిపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ (Ajit Pawar) ఈ పదవికి శుక్రవారం రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్‌సీపీలోని కొందరు ఎమ్మెల్యేలు ఆదివారం అధికార బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపి, ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించడంతోపాటు ఆయన వర్గంలోని ఎనిమిది మందికి మంత్రి పదవులు దక్కాయి.

శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ వర్గానికి ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్యే జితేంద్ర అవహద్ నియమితులయ్యారు. ఈ పదవిని కాంగ్రెస్ కోరుకోవడాన్ని శరద్ పవార్ సమర్థించారు. మహా వికాస్ అగాడీ కూటమిలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ ఉన్నాయి.

కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్ సోమవారం మాట్లాడుతూ, కాంగ్రెస్ శాసన సభా పక్షం సమావేశం మంగళవారం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో శాసన సభలో ప్రతిపక్ష నేత పదవిని కోరడంపై చర్చ జరిగే అవకాశం ఉందన్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ కేవలం తన వర్గం నేతను మాత్రమే నియమించుకోగలదని చెప్పారు.

సీనియర్ కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీలో ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారో తెలుసుకున్న తర్వాత శాసన సభలో ప్రతిపక్ష నేత పదవికి ఎవరిని నియమించాలో నిర్ణయించడంలో సమస్య ఉండదని చెప్పారు.

మహారాష్ట్ర శాసన సభలో 288 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చీలిక రాక ముందు ఎన్‌సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. చీలిక తర్వాత అజిత్ పవార్‌తో ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారనేదానిపై స్పష్టత లేదు.

ఇవి కూడా చదవండి :

Khalistan terrorists : సిక్కు తీవ్రవాదుల నిరసనలపై కెనడాను హెచ్చరించిన భారత్

BJP state president: ‘గో బ్యాక్‌ సీఎం’ బెలూన్లతో నిరసన తెలుపుతాం..

Updated Date - 2023-07-04T10:41:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising