రాష్ట్రంలోని ఆ రెండు జిల్లాల పేర్లు మార్చుతూ నోటిఫికేషన్ జారీ!
ABN, First Publish Date - 2023-09-16T14:23:17+05:30
ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లను ఛత్రపతి శంభాజీనగర్, ధరాశివ్‌గా మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. కొన్ని నెలల క్రితం పేర్ల మార్పుపై స్థానికుల నుంచి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించింది.
ముంబై: ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లను ఛత్రపతి శంభాజీనగర్, ధరాశివ్‌గా మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. కొన్ని నెలల క్రితం పేర్ల మార్పుపై స్థానికుల నుంచి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించింది. వాటి పరిశీలన అనంతరం సబ్ డివిజన్, గ్రామం, తాలూకా, జిల్లా స్థాయిల్లో పేర్లను మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి రెవెన్యూశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022 జూన్ 29న అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వ చివరి క్యాబినెట్ సమావేశంలో ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒక రోజు తర్వాత ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎంగా ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం గవర్నర్ మెజారిటీ నిరూపించుకోవాలని కోరిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇది చట్టవిరుద్ధమని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం తెలిపింది. దీంతో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం పక్కనపెట్టింది. ఆ తర్వాత ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లను వరుసగా ఛత్రపతి శంభాజీనగర్, ధరాశివ్‌గా మార్చడానికి గత ఏడాది జూలైలో షిండే ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదం తెలిపింది మహా వికాస్ అఘాడి ప్రభుత్వ చివరి క్యాబినెట్ సమావేశంలో ఔరంగాబాద్ పేరును సంభాజీనగర్‌గా మార్చారు, అయితే షిండే ప్రభుత్వం దానికి 'ఛత్రపతి' అనే ఉపసర్గను చేర్చింది.
Updated Date - 2023-09-16T14:23:17+05:30 IST