ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Maharashtra : దేవేంద్ర ఫడ్నవీస్‌కు అజిత్ పవార్ షాక్

ABN, First Publish Date - 2023-07-13T14:24:47+05:30

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలోని ఎన్‌సీపీని అణగిమణగి ఉండేలా చేయాలనుకున్న ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ వర్గాలకు గట్టి ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు తెలుస్తోంది.

Devendra Fadnavis, Ajit Pawar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతోంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలోని ఎన్‌సీపీని అణగిమణగి ఉండేలా చేయాలనుకున్న ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ వర్గాలకు గట్టి ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు తెలుస్తోంది. అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలను అజిత్ వర్గం ఎగరేసుకుపోబోతున్నట్లు సమాచారం. అదే జరిగితే ఫడ్నవీస్, షిండే వర్గాల్లో అసంతృప్తి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖను ఎన్‌సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు అప్పగించబోతున్నారు. అత్యంత ప్రధాన శాఖను పొందగలిగితే అజిత్ పవార్‌ గొప్ప విజయం సాధించినట్లే. అదే జరిగితే షిండే, ఫడ్నవీస్ వర్గాలు డీలా పడటం ఖాయం. షిండే, ఫడ్నవీస్‌లతో అజిత్ చర్చలు జరుపుతూ, తమ పార్టీ మంత్రులకు ముఖ్యమైన శాఖలను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

కొత్తగా వచ్చిన ఎన్‌సీపీకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వవద్దని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అజిత్ వర్గం చేరికతో షిండే, ఫడ్నవీస్ వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది. షిండే, పవార్ వర్గాల మధ్య ప్రతిష్టంభన కారణంగానే ఎన్‌సీపీ మంత్రులకు శాఖల కేటాయింపులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, ప్రణాళిక, సహకార శాఖల కోసం పవార్ వర్గం పట్టుబడుతున్నట్లు, వారికి ఆ పోర్టుఫోలియోలను ఇవ్వవద్దని ప్రత్యర్థి వర్గాలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

జూలై 10-11 తేదీల మధ్య రాత్రి షిండే, ఫడ్నవీస్, పవార్ చర్చలు జరిపారు. ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ బుధవారం మాట్లాడుతూ, పోర్టుఫోలియోల పంపిణీ సమస్య పరిష్కారమైందన్నారు. ఒకట్రెండు రోజుల్లో శాఖల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీజేపీ పెద్దలను కలవలేదని, అందుకే పవార్, తాను ఢిల్లీ వచ్చామని తెలిపారు. పోర్టుఫోలియోల కేటాయింపు విషయంలో బీజేపీ-శివసేన-ఎన్‌సీపీ మధ్య ఘర్షణ పెరుగుతోందనే ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ నెల 18న తాము ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తామన్నారు. పవార్, పటేల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ఇతర బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ చేరుకున్నారు.

ఎన్‌సీపీ అనూహ్యంగా చీలిపోయి, అజిత్ పవార్ వర్గం బీజేపీ-శివసేన కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. జూలై 2న అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగానూ, మరో ఎనిమిది మంది మంత్రులుగానూ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో ఈ మూడు పార్టీల నుంచి తొమ్మిది మంది చొప్పున మంత్రులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి :

Floods : యమునా నదిలో వరద ఉద్ధృతి.. కేజ్రీవాల్ నివాసం వద్ద బీభత్సం..

Haryana : ఎమ్మెల్యే చెంప పగులగొట్టిన వరద బాధితురాలు

Updated Date - 2023-07-13T14:24:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising