ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

I.N.D.I.A : ప్రధాన మంత్రి పదవి రేసులో తొలి పేరు ఇదే!

ABN, First Publish Date - 2023-07-19T14:05:16+05:30

రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A) తరపున ప్రధాన మంత్రి పదవికి రేసులో మొదటి అభ్యర్థి పేరు తెరపైకి వచ్చింది. ఈ పదవి పట్ల తమకు ఆసక్తి లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) ప్రకటించిన నేపథ్యంలో టీఎంసీ ఓ ముందడుగు వేసింది. గతంలో జేడీయూ కూడా తమ అధినేతను బరిలో నిలుపుతామని చెప్పింది.

కోల్‌కతా : రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A) తరపున ప్రధాన మంత్రి పదవికి రేసులో మొదటి అభ్యర్థి పేరు తెరపైకి వచ్చింది. ఈ పదవి పట్ల తమకు ఆసక్తి లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) ప్రకటించిన నేపథ్యంలో టీఎంసీ ఓ ముందడుగు వేసింది. గతంలో జేడీయూ కూడా తమ అధినేతను బరిలో నిలుపుతామని చెప్పింది.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ఇప్పటికి రెండుసార్లు సమావేశమయ్యాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో మొదటి సమావేశం జూన్‌లో పాట్నాలో జరిగింది. రెండో సమావేశం సోమ, మంగళవారాల్లో బెంగళూరులో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న 26 ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా (I.N.D.I.A) అనే పేరును ఖరారు చేశాయి.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘‘మా (కాంగ్రెస్) కోసం అధికారం పొందాలనేది మా ఉద్దేశం కాద’’న్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు ఉండవచ్చునని, అయితే జాతీయ స్థాయిలో ప్రజల కోసం ఆ విభేదాలను పక్కన పెట్టవచ్చునని చెప్పారు. కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల మధ్య సయోధ్య కుదరాలనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఓ పార్టీ నేత మాట్లాడుతూ, ఖర్గే వ్యాఖ్యలను స్వాగతించారు. అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఉదారంగా వ్యవహరించడం అవసరమన్నారు. అందరినీ కలుపుకొనిపోవాలన్నారు. వామపక్ష పార్టీ నేత ఒకరు మాట్లాడుతూ, ఖర్గే ప్రసంగం ఈ సమావేశం పరిస్థితిని తెలియజేస్తోందన్నారు. ప్రధాన మంత్రి పదవికి ఎవరిని నిలుపుతారనే ప్రశ్న కూటమిని నాశనం చేసే అవకాశం ఉన్న సమయంలో ఖర్గే సకాలంలో వివరణ ఇచ్చారన్నారు.

ఖర్గే వ్యాఖ్యలపై టీఎంసీ ఎంపీ శతాబ్ది రాయ్ స్పందిస్తూ, ప్రధాన మంత్రి పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేకపోతే, మమత బెనర్జీ ఆ పదవిని చేపట్టాలని తాము కోరుకుంటామని, ఆమెకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌లో మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ శతాబ్ది రాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

టీఎంసీ ఎంపీ శాంతను సేన్ ఏప్రిల్ నెలలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, మమత బెనర్జీ కన్నా మెరుగైన విశ్వసనీయతగలవారు ఎవరున్నారని ప్రశ్నించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో మమత బెనర్జీకి అందరూ మద్దతివ్వాలన్నారు. ఆమె కన్నా ఎక్కువ అనుభవంగల నేతను కనీసం ఒకరిని చూపించండని అడిగారు. మమత నాలుగుసార్లు కేంద్ర మంత్రిగా, ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవంగలవారని తెలిపారు. ‘‘ఇంత కన్నా మెరుగైన ట్రాక్ రికార్డ్ ఉన్నవారిని చూపించండి’’ అని అడిగారు. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని టీఎంసీ కోరుకుంటోందని, అయితే తమకు హెడ్మాస్టర్‌గా కాంగ్రెస్‌ను స్వీకరించడానికి తాము సిద్ధంగా లేమని చెప్పారు.

ప్రధాన మంత్రి పదవి రేసులో బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌ను నిలుపుతామని ఆ పార్టీ ఉత్తర ప్రదేశ్ శాఖ కన్వీనర్ సత్యేంద్ర పాల్ ఏప్రిల్‌లో చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Covid Outbreat : కోవిడ్-19 వైరస్ ప్రారంభంపై అనుమానాలు.. వూహన్ ఇన్‌స్టిట్యూట్‌కు అమెరికా నిధుల నిలిపివేత..

Terror Plot : బెంగళూరులో భారీ ఉగ్ర దాడుల కుట్ర భగ్నం

Updated Date - 2023-07-19T14:29:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising