ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manipur violence: మణిపూర్‌లో బయటపడ్డ మరో దారుణం.. నెట్టింట వైరలైన ఈ ఫోటోలను చూస్తే గుండె బరువెక్కుతోంది!

ABN, First Publish Date - 2023-09-26T11:46:06+05:30

కొన్ని రోజుల క్రితం అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరో దారుణ ఘటన బయటపడింది. కొద్ది నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు.

మణిపూర్: కొన్ని రోజుల క్రితం అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరో దారుణ ఘటన బయటపడింది. కొద్ది నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. వారి మ‌ృతదేహాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెట్టింట వైరలైన ఈ ఫోటోలను చూస్తే గుండె బరువెక్కిపోతుంది. దీంతో మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జాతుల మధ్య నెలకొన్న వైరంతో రాష్ట్రంలో అల్లర్లు చెలరేగడంతో మణిపూర్‌లో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అయితే ఇటీవల పరిస్థితులు సద్దమణగడంతో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది. ఈ క్రమంలోనే విద్యార్థుల మృతదేహాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రెండు ఫోటోలు వైరల్‌ కాగా అందులో ఒక దాంట్లో విద్యార్థులను కొంతమంది సాయుధులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించి ఉంచగా.. వారి వెనుక సాయుధులు కన్పిస్తున్నారు. ఆ ఫోటోలో విద్యార్థులు ఇద్దరు గడ్డిపై కూర్చుకున్నారు. మరో ఫోటోలో విద్యార్థుల మృతదేహాలను పొదల మధ్యలో పడవేసి కన్పించింది. సదరు విద్యార్థులను సాయుధులే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.


దీంతో ప్రస్తుతం ఈ ఘటన మణిపూర్‌లో మరోసారి దుమారం రేపుతోంది. చనిపోయిన విద్యార్థులు మైతేయి వర్గానికి చెందిన 17 ఏళ్ల హిజామ్ లింతోంగంబి, 20 ఏళ్ల ఫిజామ్ హేమ్‌జిత్‌గా గుర్తించారు. దీంతో కుకీ వర్గానికి చెందిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా విద్యార్థులు ఇద్దరు జూలై 6 నుంచి కనిపించకుండాపోయారు. జూలై 6న ఆంక్షలు సడలించడంతో సదరు అమ్మాయి నీట్ కోచింగ్ కోసం ఇంటి నుంచి బయటికి వెళ్లింది. ఈ క్రమంలోనే విద్యార్థులిద్దరు బైక్‌పై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు. అప్పటి నుంచి వారిద్దరు కనిపించకుండా పోయారు. వారి ఫోన్లు స్విచ్ఛాప్ అయ్యాయి. వారిద్దరు ఇంఫాల్‌కు సమీపంలోని నంబోల్ వైపు వెళ్లినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైందని అప్పట్లో పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే విద్యార్థులిద్దరు సాయుధులకు చిక్కి ఉండొచ్చని, వారిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనపై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ స్పందించారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఈ కేసును ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించారు. దీంతోపాటు మణిపూర్‌లో జరిగిన మరో 9 దారుణ ఘటనలపై సీబీఐ విచారిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

“రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థల కలిసి ఇద్దరు విద్యార్థులను హత్య చేసిన నేరస్థులను గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నారు. నేరస్థులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు కూడా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఫిజామ్ హేమ్‌జిత్, హిజామ్ లింతోఇంగంబిని కిడ్నాప్ చేసి చంపిన వారందరిపై వేగంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రజలకు హామీ ఇస్తుంది. న్యాయం జరిగేలా చూడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ క్రూరమైన నేరానికి బాధ్యులెవరైనా సరే కఠిన శిక్షను విధిస్తుంది, ”అని ప్రకటనలో పేర్కొంది. అలాగే ప్రజలు సంయమనం పాటించాలని కోరింది. కాగా మణిపూర్‌లో జాతుల మధ్య నెలకొన్న గొడవల కారణంగా మే 3న జాతి హింస చెలరేగడంతో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 3,000 మందికి పైగా గాయపడ్డారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన బయటకు రావడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఈ క్రమంలోనే హింసను నియంత్రించడానికి, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి పోలీసులతో పాటు 40,000 మంది కేంద్ర భద్రతా సిబ్బంది మోహరించారు. నాలుగు నెలల తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది.

Updated Date - 2023-09-26T11:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising