ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Narayana : ఎన్నికల జిమ్మిక్‌లో భాగంగానే పార్లమెంట్‌పై దాడి

ABN, Publish Date - Dec 23 , 2023 | 04:32 PM

పార్లమెంట్‌నే కాపాడలేని అసమర్ధులు భారతదేశాన్ని ఎలా కాపాడతారని మోదీ ప్రభుత్వాన్ని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) ఎద్దేవా చేశారు. శనివారం నాడు ఢిల్లీలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...భారతదేశ చరిత్రలో ఇంత మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘటన గతంలో ఎప్పుడూ లేదు. వారు చేసిన తప్పేంటి? పార్లమెంట్‌పై దాడి ఘటనపై చర్చకు పట్టుబట్టారని నారాయణ తెలిపారు.

ఢిల్లీ: పార్లమెంట్‌నే కాపాడలేని అసమర్ధులు భారతదేశాన్ని ఎలా కాపాడతారని మోదీ ప్రభుత్వాన్ని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) ఎద్దేవా చేశారు. శనివారం నాడు ఢిల్లీలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘భారతదేశ చరిత్రలో ఇంత మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘటన గతంలో ఎప్పుడూ లేదు. వారు చేసిన తప్పేంటి? పార్లమెంట్‌పై దాడి ఘటనపై చర్చకు పట్టుబట్టారు. ఒకవేళ ఏదైనా జరిగితే సభ్యులు చనిపోయేవారు కదా? బీజేపీ ఎంపీ పాస్ ఇవ్వడం నిజమా కాదా? పొరపాటున ఏ MIM ఎంపీ ఇచ్చి ఉంటే ఏం చేసేవారు? పార్లమెంట్‌నే కాపాడలేని అసమర్థులు భారతదేశాన్ని ఎలా కాపాడతారు? ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని నా అనుమానం’’ అని నారాయణ అన్నారు.

ఇండియా కూటమికి దేశంలో పెరుగుతున్న జనాదరణ

‘‘ఎన్నికల్లో లబ్ధి కోసం చేసిన నాటకీయ ప్రక్రియలా అనిపిస్తోంది. లేదంటే ఈ విషయంలో ఎంత సీరియస్‌గా వ్యవహరించాలి? అలాంటిదేమీ కనిపించడం లేదే? ఎన్నికల జిమ్మిక్‌లో భాగంగానే పార్లమెంట్‌లో ప్రమాదకర గేమ్ ఆడారు. ఇండియా కూటమికి దేశంలో జనాదరణ పెరుగుతుంది కాబట్టి ఇలా కుయుక్తులు పన్నుతున్నారు. రామజన్మభూమి ఆలయానికి వ్యూహాత్మకంగా అందరినీ పిలిచారు. బాబ్రీ మసీదు కూలగొట్టడానికి ఆద్యుడు ఎల్కే అద్వానీ. కానీ ఆయనని రానివ్వడం లేదు. అద్వానీ వస్తే పేరు ఆయనకే వెళ్తుంది. అది మోదీకి ఇష్టం లేదు. అందుకే అద్వానీ, మురళీ మనోహర్ జోషికి ఆహ్వానం లేదు. ఉపరాష్ట్రపతిని మిమిక్రీ చేశామని గోల చేస్తున్నారు. అది ఒక కళ. ఇండియా కూటమి పొత్తులు తెలంగాణలో విజయం సాధించాయి’’ అని నారాయణ పేర్కొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 04:55 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising