Kumaraswamy vs DK: పార్లమెంటు భవన ప్రారంభోత్సవంపై హెచ్‌డీ, డీకే వాగ్యుద్ధం
ABN , First Publish Date - 2023-05-26T15:14:36+05:30 IST
న్యూఢిల్లీ: పార్లమెంటు నూత భవన ప్రారంభోత్సవం వ్యవహారంపై జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య శుక్రవారంనాడు మాటల యుద్ధం చేటుచేసుకుంది. తాము కాంగ్రెస్‌కు బానిసలం కాదని కుమారస్వామి వ్యాఖ్యానించగా, కుమారస్వామి గతం మరిచిపోయి మాట్లాడుతున్నారంటూ డీకే ప్రతివిమర్శలు చేశారు.
న్యూఢిల్లీ: పార్లమెంటు నూత భవన ప్రారంభోత్సవం వ్యవహారంపై జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy), కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మధ్య శుక్రవారంనాడు మాటల యుద్ధం చేటుచేసుకుంది. రాష్ట్రపతికి బదులుగా పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనుండడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా 19 విపక్ష పార్టీలు ఆ కార్యక్రమాన్ని బహిష్కరించగా, తాను హాజరువుతున్నట్టు జేడీఎస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ప్రకటించారు. దెవెగౌడ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్చడంతో కుమారస్వామి మండిపడ్డారు. తామేమీ కాంగ్రెస్ పార్టీ బానిసలం కాదంటూ విమర్శించారు. దీనిని డీకే శివకుమార్ తిప్పికొట్టారు. కుమారస్వామి గతం మరిచిపోయి మాట్లాడుతున్నారంటూ తూర్పారబట్టారు.
కాంగ్రెస్‌కు మేము బానిసలం కాదు...
పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి హాజరుకావాలని మాజీ ప్రధాని దేవెగౌడ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ మండిపడటంపై కుమారస్వామిని మీడియా శుక్రవారం ప్రశ్నించింది. దీంతో ఆయన ఒక్కసరిగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ''మేము కాంగ్రెస్‌కు బానిసలం కాదు. మా సొంత నిర్ణయాలు మేము తీసుకుంటాం. కాంగ్రెస్‌ను ఎందుకు అనుసరించాలి?'' అని కుమారస్వామి ప్రశ్నించారు. రాష్ట్రపతిపై ఇంత గౌరవం చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఆమెపై తమ అభ్యర్థిని ఎలా నిలబెట్టారని నిలదీశారు. ఇప్పుడు ఆదివాసీలను బీజేపీ అవమానపరించిందని వాళ్లు (కాంగ్రెస్) చెబుతున్నారని, ఇది ప్రజల దృష్టిని మళ్లించి, ఒక వర్గం ప్రజల నుంచి ఓట్ల లబ్ధి పొందేందుకు చేస్తున్న ప్రయత్నమేనని విమర్శించారు.
మీరు చేసిందేమిటని నిలదీసిన డీకే
కాగా, రాష్ట్రపతి ఎన్నికల జరిగినప్పుడు ఓటింగ్‌కు జేడీఎస్ బాయ్‌కాట్ చేసిందని, హెచ్‌డీ కుమారస్వామి ఆ మాట మరిచిపోయి ఉండవచ్చని డీకే చురకులు వేశారు. నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాల్సి ఉంటుందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ భాగస్వామ్యంతో హెచ్‌డీ కుమారస్వామి సీఎంగా కొద్దికాలం గతంలో పనిచేశారు.