Dog bite: ప్రభుత్వ ప్రసూతి వార్డులో దారుణం...నవజాత శిశువును నోట కరచుకెళ్లిన కుక్క...ఆపై ఏమైందంటే...
ABN , First Publish Date - 2023-04-03T10:38:48+05:30 IST
కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులో దారుణం జరిగింది....
శివమొగ్గ(కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులో దారుణం జరిగింది.శివమొగ్గ ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులోకి వచ్చిన ఓ వీధి కుక్క నవజాత శిశువును నోటకరచుకొని ఈడ్చుకెళ్లింది.(Dog bite) ఉదయం 7 గంటల సమయంలో వీధికుక్క నవజాత శిశువును నోటకరచుకొని ప్రసూతి వార్డు చుట్టూ తిరగటాన్ని(Drags it around govt hospital) గమనించిన సెక్యూరిటీ గార్డులు దాన్ని తరిమికొట్టారు. కుక్క నోటి నుంచి వదిలిన శిశువును వైద్యులు పరిశీలించగా అప్పటికే మరణించినట్లు తేలింది.(Newborn dies)
ఇది కూడా చదవండి : Indian Idol 13: ఇండియన్ ఐడల్ విజేత రిషిసింగ్...రూ.25లక్షల నగదు బహుమతి, కారు ప్రదానం
వీధి కుక్క కాటు వల్లనే నవజాత శిశువు మరణించాడా అనే విషయంపై వైద్యులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, శిశువు మృతదేహం పోస్టు మార్టం తర్వాత విషయం తెలుస్తుందని వైద్యులు చెప్పారు. నవజాత శిశువు సమాచారం కోసం వైద్యులు ప్రసూతి వార్డును పరిశీలిస్తున్నారు.