ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra : ఇది వ్యక్తిగత పోరు కాదు.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉద్ధవ్ థాకరే స్పందన..

ABN, First Publish Date - 2023-05-11T15:09:40+05:30

మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) రాజీనామా చేసి ఉండకపోతే, ఆయనను ఆ పదవిలో పునఃప్రతిష్ఠించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) రాజీనామా చేసి ఉండకపోతే, ఆయనను ఆ పదవిలో పునఃప్రతిష్ఠించి ఉండేవారమని సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. తన పోరాటం ముఖ్యమంత్రి పదవి కోసం చేస్తున్న వ్యక్తిగత పోరాటం కాదని చెప్పారు. తాను రాజీనామా చేయడం పొరపాటు అయి ఉండవచ్చునని, కానీ పరిస్థితులను తాను ఆ దృష్టితో చూడటం లేదని చెప్పారు. తాను ప్రజల కోసం పోరాడుతున్నానని, ప్రజాస్వామ్యం కోసం, తన తండ్రి బాలా సాహెబ్ థాకరేను అనుసరించేవారి కోసం పోరాడుతున్నానని తెలిపారు. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar)తో కలిసి గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

తాను నైతిక కారణాలతో రాజీనామా చేసినట్లు థాకరే తెలిపారు. పార్టీ నుంచి అన్నిటినీ పొందినవారు ద్రోహులుగా మారారని, ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని నిరూపించుకోవాలని కోరారని చెప్పారు. దానిలో భాగస్వామ్యం కావాలని తాను అనుకోలేదన్నారు. శాసన సభలో బల పరీక్షకు ముందే రాజీనామా చేయడాన్ని ఆయన సమర్థించుకున్నారు.

తాను నైతిక కారణాలతో రాజీనామా చేశానని, అదే విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde), ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను రాజీనామా చేసి ఉండకపోతే, తనను ముఖ్యమంత్రిగా పునఃప్రతిష్ఠించి ఉండేవారమని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. కానీ తాను తన కోసం పోరాడటం లేదని, తాను దేశం కోసం, రాష్ట్రం కోసం పోరాడుతున్నానని చెప్పారు.

సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు అటు షిండే, ఇటు థాకరే వర్గాలకు ఏదో ఓ విధంగా సంతోషకరంగా ఉంది. షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకపోవడం, ఎవరు నిజమైన శివసేన అనే అంశాన్ని శాసన సభ సభాపతి నిర్ణయిస్తారని చెప్పడం ఆ వర్గానికి సంతోషాన్నిచ్చింది. షిండే వర్గమే నిజమైన శివసేన పార్టీ అని ఎన్నికల కమిషన్ ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే.

శివసేన (Shiv Sena) ఎమ్మెల్యేలు షిండే వర్గంలోకి వెళ్ళడంతో బల పరీక్ష నిర్వహించాలని అప్పటి మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోషియారీ ఆదేశించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ ఆదేశం కారణంగానే ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూలిపోయింది. ఈ తీర్పు ప్రస్తుత షిండే ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఉద్ధవ్ వర్గం ఆరోపిస్తోంది.

శాసన సభలో బల పరీక్ష జరగడానికి ముందే ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినందువల్ల ఆయనను తిరిగి ఆ పదవిలో నియమించలేకపోతున్నామని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

2022 జూన్‌లో శివసేన పార్టీ చీలిపోయిన సంగతి తెలిసిందే. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో 40 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి :

Uddhav Thackeray: సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట

The Kerala Story:సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన కేరళ స్టోరీ టీమ్

Updated Date - 2023-05-11T15:34:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising