ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IndiGo flight: ఇండిగో విమానం గాల్లో ఉండగానే ఈ ప్రయాణికుడు ఎంత పని చేశాడో చూడండి..

ABN, First Publish Date - 2023-09-20T10:50:53+05:30

విమానంలో ప్రయాణికుల చేష్టలు కొన్ని సార్లు ఇతర ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తాయి. వారి వింత వింత చేష్టలతో తోటి ప్రయాణికులనే కాకుండా విమాన సిబ్బందిని కూడా భయపెడుతుంటారు.

చెన్నై: విమానంలో ప్రయాణికుల చేష్టలు కొన్ని సార్లు ఇతర ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తాయి. వారి వింత వింత చేష్టలతో తోటి ప్రయాణికులనే కాకుండా విమాన సిబ్బందిని కూడా భయపెడుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు ఏకంగా ఎమర్జెన్సీ డోర్‌ను తెరవబోయాడు. దీంతో తోటి ప్రయాణికులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇండిగో విమానం 6E 6341 మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి చెన్నైకి బయలుదేరింది. అయితే విమానం మరికాసేపట్లో చెన్నైలో ల్యాండ్ అవుతుందనగా గాల్లో ఉండగానే మణికందన్‌ అనే వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. చెన్నై విమానాశ్రయానికి చేరుకోగానే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులకు అప్పగించారు. ఇండిగో అధికారులు ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. సీఐఎస్‌ఎఫ్ అధికారులకు ఎయిర్‌లైన్ అధికారులు జరిగిన ఘటన గురించి వివరించి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుతోంది. అయితే సదరు ప్రయాణికుడు అలా ఎందుకు చేశాడనేది దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-09-20T10:50:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising