ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ayodhya Ram Temple : విద్వేష భూమిలో రామాలయం నిర్మాణం : ఆర్జేడీ బిహార్ చీఫ్

ABN, First Publish Date - 2023-01-07T14:04:00+05:30

రాష్ట్రీయ జనతా దళ్ (RJD) బిహార్ శాఖ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ (Jagdanand Singh) అయోధ్యలోని రామ జన్మభూమిపై

Jagadanand Singh, Ram Temple
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : రాష్ట్రీయ జనతా దళ్ (RJD) బిహార్ శాఖ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ (Jagdanand Singh) అయోధ్యలోని రామ జన్మభూమిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్వేష భూమిలో రామాలయాన్ని నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ‘హే రామ్’ను నమ్ముతామని, ‘జై శ్రీరామ్‌’ను కాదని చెప్పారు. కేంద్ర హోం మంత్రి ఇటీవల త్రిపురలో మాట్లాడుతూ, రామాలయం వచ్చే ఏడాది జనవరి 1నాటికి భక్తుల పూజల కోసం సిద్ధమవుతుందని చెప్పిన నేపథ్యంలో జగదానంద్ శుక్రవారం (జనవరి 6న) ఈ వ్యాఖ్యలు చేశారు.

ఓ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, జగదానంద్ సింగ్ శుక్రవారం మాట్లాడుతూ, రామాలయాన్ని విద్వేష భూమిలో నిర్మిస్తున్నారన్నారు. రాముడిని అద్భుతమైన అంతఃపురంలో ఖైదీగా ఉంచకూడదన్నారు. తాము ‘హే రామ్’ను నమ్మేవారమని, ‘జై శ్రీరామ్’ను కాదని చెప్పారు.

అమిత్ షాను ఉద్దేశించి మాట్లాడుతూ, రాముడు ఇప్పుడు ప్రజల హృదయాలను వదిలిపెట్టి, దేవాలయాల్లో కూర్చుంటాడా? అని సింగ్ ప్రశ్నించారు. ‘‘ఇప్పుడు రాముడు కేవలం దేవాలయానికి మాత్రమే పరిమితమా? ఇప్పుడు ఇక రాముడు దేశానికి చెందినవాడు కాదా? ఇండియాలో ప్రజల హృదయాల నుంచి రాముడిని ఎవరూ లాక్కోలేరు, రాళ్ళతో నిర్మించిన విలాసవంతమైన భవనంలో మాత్రమే కూర్చోబెట్టలేరు. శ్రీరామ్ అయోధ్యలో కానీ, లంకలో కానీ లేడు, శబరి గుడిసెలో ఉన్నాడు’’ అని చెప్పారు.

అయోధ్యలో రామాలయం (Ayodhya Ram Temple) నిర్మాణానికి 2020 ఆగస్టు 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. దీని నిర్మాణం వేగంగా జరుగుతోంది. 2023 డిసెంబరునాటికి రామాలయం నిర్మాణం పూర్తవుతుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) గత నవంబరులో చెప్పారు.

Updated Date - 2023-01-07T14:04:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising