Holi Celebrations : ఆరెస్సెస్ ఇలా హోళీ జరుపుకోవడం ఇదే తొలిసారి!

ABN , First Publish Date - 2023-03-07T18:23:04+05:30 IST

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh -RSS) అనుబంధ సంస్థ సేవా భారతి హోళీ సంబరాలు ఈసారి ప్రత్యేకంగా

Holi Celebrations : ఆరెస్సెస్ ఇలా హోళీ జరుపుకోవడం ఇదే తొలిసారి!
Sewa Bharati Holi Celebrations

న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh -RSS) అనుబంధ సంస్థ సేవా భారతి హోళీ సంబరాలు ఈసారి ప్రత్యేకంగా జరిగాయి. శిఖండి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లను ప్రత్యేకంగా ఆహ్వానించి, వేడుకలను నిర్వహించారు. ఈ సంస్థ ఆహ్వానం మేరకు వచ్చిన ట్రాన్స్‌జెండర్లను వేదికపైకి ఆహ్వానించారు.

మహా భారతంలో ద్రౌపది (Draupadi) తండ్రి ద్రుపద మహారాజుకు కుమార్తె జన్మించింది. ఆమె ఆ తర్వాత పురుషునిగా మారడంతో శిఖండి (Shikhandi) అయింది. అందుకే ట్రాన్స్‌జెండర్లను శిఖండి భాయి, బెహన్ అని సేవా భారతి ప్రతినిధులు పిలుస్తున్నారు.

ఆరెస్సెస్, సేవా భారతి నిర్వహించే హోళీ సంబరాల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనడం ఇదే మొదటిసారి. ఢిల్లీలోని సేవా భారతి ప్రధాన కార్యాలయంలో ఈ సంబరాలు ఆదివారం జరిగాయి. LGBTIQA+ communityని సమాజంలో గౌరవించాలనే లక్ష్యంతో ఆరెస్సెస్ పని చేస్తోంది. ఈ వర్గంవారు కూడా సనాతన ధర్మంలో భాగమేనని నిర్వాహకులు తెలిపారు. ఈ వర్గంవారి కోసం ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ చర్యలను కూడా ఆరెస్సెస్ నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి :

Congress Vs BJP : స్వదేశాన్ని అవమానిస్తున్న రాహుల్ గాంధీ : రవిశంకర్ ప్రసాద్

Odisha : నీటి కోసం చిన్నారుల అష్టకష్టాలు

Updated Date - 2023-03-07T18:23:04+05:30 IST