ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NCP : ఎన్‌సీపీ ఎమ్మెల్యేల ఒక కాలు బీజేపీ పడవలో.. అందుకే శరద్ పవార్ రాజీనామా.. : ‘సామ్నా’

ABN, First Publish Date - 2023-05-04T16:49:07+05:30

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ పదవికి శరద్ పవార్ (Sharad Pawar) రాజీనామా చేయడానికి కారణాలను ‘సామ్నా’ సంపాదకీయం విశ్లేషించింది.

Sharad Pawar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ పదవికి శరద్ పవార్ (Sharad Pawar) రాజీనామా చేయడానికి కారణాలను ‘సామ్నా’ సంపాదకీయం విశ్లేషించింది. పవార్ బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆయన పార్టీ అధ్యక్ష హోదాలో తన చిట్టచివరి ప్రసంగాన్ని సిద్ధం చేసుకుని వచ్చారని తెలిపింది. అయితే ఇది అసాధారణ నిర్ణయమని వ్యాఖ్యానించింది.

తాను ఎన్‌‌సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు శరద్ పవార్ ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు కలవరపడ్డారని, అయితే అప్పటికే వారిలో చాలా మంది ఒక కాలును బీజేపీ (BJP) పడవలో పెట్టి ఉంచారని తెలిపింది. పార్టీ ముక్కలయ్యే సమయంలో గౌరవప్రదంగా తప్పుకోవాలని పవార్ నిర్ణయించుకుని ఉండవచ్చునని అంచనా వేసింది. ‘మీరే పార్టీ’ అని జయంత్ పాటిల్ సరిగ్గానే చెప్పారని వ్యాఖ్యానించింది. ఎన్‌సీపీ (NCP) నేడు శరద్ పవార్ పేరు మీదే నిలబడిందని తెలిపింది.

ఎన్‌సీపీ భవిష్యత్తు గురించి కూడా ఈ సంపాదకీయం ప్రస్తావించింది. ఎంపీగా సుప్రియ సూలే (Supriya Sule) బాగా పని చేశారని ప్రశంసించింది. ఆమెకు న్యూఢిల్లీలో కూడా మంచి పట్టు ఉందని తెలిపింది. కానీ అజిత్ పవార్ (Ajit Pawar) ఏకైక లక్ష్యం ముఖ్యమంత్రి కావడమేనని వ్యాఖ్యానించింది. రాజకీయాలు, సామాజిక సేవలో శరద్ పవార్ కృషి చాలా ఉందని చెప్తూ, ఆయన నిర్ణయం ఓ మాస్టర్‌స్ట్రోక్ అని తెలిపింది. ఆయన నిర్ణయం ఓ బాంబులా పడిందని పేర్కొంది. పార్టీలో జరుగుతున్నదానిని ఆయన బయటపెట్టారని తెలిపింది. ఇప్పటి వరకు జరిగినదానిలో పవార్ హీరో అని పేర్కొంది. భారత దేశ రాజకీయాల్లో భీష్మునిగా శరద్ పవార్‌ను అభివర్ణించింది. భీష్ముడిలా పడిపోకుండా తాను సారథ్యంవహిస్తానని ఆయన చూపించారని తెలిపింది.

‘సామ్నా’ శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) పార్టీ పత్రిక అనే విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Atiq Ahmed Murder : అతిక్ సోదరుల హత్యతో వెలుగు చూసిన మరో దారుణం.. కారును ఓవర్‌టేక్ చేసిన వ్యక్తిని చంపేసిన గ్యాంగ్‌స్టర్..

Congress Vs BJP : ముస్లింలను కాంగ్రెస్ తప్పుదోవపట్టిస్తోంది : కర్ణాటక సీఎం

Updated Date - 2023-05-04T16:49:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising