Delhi liquor Scam కేసులో ప్రముఖ మీడియా అధినేత అరెస్ట్
ABN, First Publish Date - 2023-02-09T10:57:22+05:30
ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi liquor Scam) కేసులో నేడు ఈడీ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న అధికారులు ఆ తరువాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును రెండో చార్జిషీట్‌లో చేర్చడంతో తిరిగి దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది.
Delhi : ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi liquor Scam) కేసులో నేడు ఈడీ అధికారులు (ED Officials) వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న అధికారులు ఆ తరువాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) పేరును రెండో చార్జిషీట్‌లో చేర్చడంతో తిరిగి దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. ఇక నిన్నటికి నిన్న ఇద్దరి అరెస్ట్‌లను ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇక నేడు కూడా ఒక ప్రముఖ మీడియా సంస్థ అధినేతను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో చారియట్ మీడియా (Chariot Media) సంస్థ అధినేత రాజేష్ జోషిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్స్ స్కాంలో ముడుపులుగా అందిన డబ్బులని గోవా ఎన్నికల (Goa Elections)కు ఆప్ (AAP) ఉపయోగించిందని ఇప్పటికే ఈడీ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ద్వారా పెద్ద ఎత్తున డబ్బును గోవా ఎన్నికలలో ఆప్ తరఫున రాజేష్ జోషి ఖర్చు పెట్టారని ఈడీ వర్గాలు తెలిపాయి.
నిన్న ఇద్దరి అరెస్ట్..
కాగా.. బుధవారం ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు (Gorantla Butchibabu)ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పలు దఫాలుగా బుచ్చిబాబును విచారించిన అనంతరం మంగళవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బుధవారం అధికారికంగా ఆయన అరెస్ట్‌ను ప్రకటించారు. ఇక నిన్ననే ఈ కేసులో మరొకరిని సైతం అధికారులు అరెస్ట్ చేశారు. బుచ్చిబాబు అరెస్ట్‌ను ప్రకటించిన కాసేపటికే ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రా (Gowtham Malhotra)ను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. మద్యం విధానంలో మార్పులకు కీలకపాత్ర వహించారని గౌతమ్ మల్హోత్రా ఆరోపణలు ఎదుర్కొన్నారు. మద్యం విధానం రూపకల్పన సమయంలో వ్యాపార లావాదేవీలు జరపడంతో పాటు... రాజకీయ పార్టీకి చెందిన వారితో డబ్బు లావాదేవీల్లో గౌతమ్ మల్హోత్రాకు భాగస్వామ్యం ఉన్నట్లు ఈడీ వెల్లడించింది.
తీర్పును వెలువరించనున్న సీబీఐ కోర్టు..
కాగా.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన నిందితుల బెయిల్‌పై నేటి సాయంత్రం నాలుగు గంటలకు తీర్పు సీబీఐ కోర్టు తీర్పును వెలువరించనుంది. లిక్కర్ కేసు నిందితులు శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy), అభిషేక్ బోయిన పల్లి (Abhishek Boinapally), సమీర్ మహెంద్రు (Sameer Mahendru), బినోయ్ బాబు (Binoy Babu), విజయ్ నాయర్ (Vijay Nayar) బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు వెలువడనుంది.
Updated Date - 2023-02-09T11:27:12+05:30 IST