Karnataka Cabinet allocation: సీఎం సిద్ధరామయ్య వద్దే ఆర్థికశాఖ...డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు బెంగళూరు నగరాభివృద్ధి శాఖ

ABN , First Publish Date - 2023-05-29T09:29:21+05:30 IST

కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు శాఖల కేటాయింపు సోమవారం జరిగింది. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎం డీకేశివకుమార్‌కు కీలకమైన బెంగళూరు నగర అభివృద్ధి శాఖను కేటాయించారు. పరమేశ్వరకు ప్రధానమైన హోంశాఖను అప్పగించారు...

Karnataka Cabinet allocation: సీఎం సిద్ధరామయ్య వద్దే ఆర్థికశాఖ...డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు బెంగళూరు నగరాభివృద్ధి శాఖ
Karnataka Cabinet allocation

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు శాఖల కేటాయింపు సోమవారం జరిగింది. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎం డీకేశివకుమార్‌కు కీలకమైన బెంగళూరు నగర అభివృద్ధి శాఖను కేటాయించారు. పరమేశ్వరకు ప్రధానమైన హోంశాఖను అప్పగించారు.వీరిలో 10 మంది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సహా మే 20వతేదీన ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం మరో 24 మంది మంత్రులు రెండో విడత మంత్రివర్గ విస్తరణలో చేరారు. దీంతో కర్ణాటక కేబినెట్‌లో 34 మంది మంత్రులు ఉన్నారు.కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య: ఆర్థిక మంత్రిత్వ శాఖ, కేబినెట్ వ్యవహారాలు, సిబ్బంది, పరిపాలనా సంస్కరణలు, ఇంటెలిజెన్స్ సమాచారంతో పాటు ఇతర కేటాయించని అన్ని శాఖలను పర్యవేక్షించనున్నారు.

డిప్యూటీ సీఎం డికె శివకుమార్‌: ప్రధాన మధ్య తరహా నీటిపారుదలతో పాటు బెంగళూరు నగర అభివృద్ధిశాఖ

జి. పరమేశ్వర: హోం మంత్రిత్వ శాఖ

ప్రియాంక్ ఖర్గే: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ

దినేష్ గుండూరావు: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

హెచ్‌కే పాటిల్‌ : లా & పార్లమెంటరీ వ్యవహారాలు, లెజిస్లేషన్, టూరిజం

కృష్ణ బైరేగౌడ: రెవెన్యూ శాఖ

డాక్టర్ డాక్టర్ హెచ్‌సి మహదేవప్ప: సాంఘిక సంక్షేమ శాఖ

ఎన్‌ఎస్‌.బోసరాజు : మైనర్‌ ఇరిగేషన్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ

కేబినెట్‌లోని ఏకైక మహిళా మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌: మహిళా శిశు సంక్షేమ శాఖ

ఎంసీ సుధాకర్ : విద్యాశాఖ

డి సుధాకర్ : ప్రణాళిక శాఖ

Updated Date - 2023-05-29T09:37:37+05:30 IST