Shocking: చిన్నారి సోదరులను పొట్టనపెట్టుకున్న వీధి కుక్కలు
ABN , First Publish Date - 2023-03-12T20:17:08+05:30 IST
దేశ రాజధానిలోని ఢిల్లీలోని వంసత్ కుంజ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఢిల్లీలోని వంసత్ కుంజ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను వీధి కుక్కలు పొట్టనపెట్టుకున్నాయి. 5, 7 ఏళ్లు ఉన్న ఈ చిన్నారులిద్దరూ సోదరులు కావడం విశేషమైతే, ఇద్దరూ వేర్వేరు ఘటనల్లో వీధికుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది.
ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం, ఈనెల 10వ తేదీన ఏడేళ్ల చిన్నారి జాడతెలియకుండా పోయింది. అయితే ఆ తర్వాత జంతువులు పీక్కుతిన్న గాయాలతో అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అతని తమ్ముడైన 5 ఏళ్ల చిన్నారి ఆదివారంనాడు ఇదే వీధికుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. కాలకృత్యాలు తీర్చుకుంటుండగా బాలుడిపై కుక్కలు విరుచుకుపడ్డాయి. కాసేపటికి బాలుడి బంధువు వచ్చే చూసేసరికి అతను విగతజీవుడై కనిపించాడు. వీధికుక్కల బారిన పడి ఐదేళ్లు, ఏడేళ్ల బాల సోదరులు మృతిచెందడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.