West Bengal: హుగ్లీలో చెలరేగిన హింసాకాండ...నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

ABN , First Publish Date - 2023-04-04T10:49:07+05:30 IST

ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని హౌరా-బర్ధమాన్ మార్గంలో రైళ్ల రాకపోకలను మూడు గంటల పాటు నిలిపివేశారు....

West Bengal: హుగ్లీలో చెలరేగిన హింసాకాండ...నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు
Train services in Bengal affected

హుగ్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ(Hooghly) రిష్రా రైల్వేస్టేషనులో రాళ్లు రువ్వుకున్న ఘటనతో ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని హౌరా-బర్ధమాన్ మార్గంలో రైళ్ల రాకపోకలను మూడు గంటల పాటు నిలిపివేశారు.(West Bengal) హౌరా-బర్ధమాన్ మెయిన్ లైన్ లో సోమవారం నుంచి మంగళవారం వరకు రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు(Train services in Bengal affected) రైల్వే సీపీఆర్ఓ కౌషిక్ మిరాన్ చెప్పారు. రైల్వే ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైళ్లను ముందుజాగ్రత్త చర్యగా రద్దు చేశామని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Donald Trump: మాన్‌హట్టన్ జిల్లా అటార్నీ కోర్టులో లొంగిపోనున్న డొనాల్డ్ ట్రంప్

శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య రాజుకున్న ఘర్షణలతో 144 సెక్షన్ విధించారు. రిష్రా వద్ద జరిగిన అల్లర్లు(fresh violence) ముందస్తు పథకం ప్రకారం జరిగాయని బెంగాల్ బీజేపీ నాయకుడు సుకుంత మజుందార్ ఆరోపించారు. హౌరా, రిష్రా అల్లర్లపై దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-04-04T10:49:07+05:30 IST