Two new Suprem juges: సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు కొత్త జడ్జీలు

ABN , First Publish Date - 2023-02-12T17:25:30+05:30 IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో ఇద్దరు ఈనెల 13వ తేదీ సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా పదోన్నతి పొందిన జస్టిస్..

Two new Suprem juges: సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు కొత్త జడ్జీలు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో ఇద్దరు ఈనెల 13వ తేదీ సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా పదోన్నతి పొందిన జస్టిస్ రాజేష్ బిందాల్ (Rajesh Bindal), అరవింద్ కుమార్ (Aravind kumar)లతో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డాక్టర్ డీవీ చంద్రచూడ్ (DY Chandrachud) ప్రమాణస్వీకారం చేయించనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నత పొందడానికి ముందు జస్టిస్ బిందాల్ అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, జస్టిస్ కుమార్ గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. కొత్తగా ఇద్దరు న్యాయమూర్తుల నియామకంతో సీజేఐతో కలిపి సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పూర్తి స్థాయికి..34కు చేరింది.

జస్టిస్ రాజేష్ బిందాల్..

-జస్టిస్ బిందాల్ పంజాబ్, హర్యానా హైకోర్టు క్యాడర్‌కు చెందిన వారు.

-2021 అక్టోబర్ 11 నుంచి అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేస్తున్నారు.

-జస్టిస్ బిందాల్ 1985లో కురుక్షేత్ర యూనివర్శిటీలో ఎల్ఎల్‌బీ చేశారు.

-1985 సెప్టెంబర్‌లో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో వృత్తిలో చేరారు.

-2006 మార్చి 22న పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు జస్టిగా పదోన్నతి పొందారు.

-పంజాబ్, హర్యానా హైకోర్టు జడ్జిగా తన పదవీకాలంలో 80,000 కేసులు పరిష్కరించారు.

-2018, నవంబర్ 19న జమ్మూకశ్మీర్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

-జమ్మూకశ్మీర్ అండ్ లడఖ్ కామన్ హైకోర్టు చీస్ జస్టిస్‌గా నియమితులయ్యారు.

-2021 జనవరి 5న కోల్‌కతా హైకోర్టు జడ్జిగా ఆన ప్రమాణస్వీకారం చేశారు

జస్టిస్ అరవింద్ కుమార్..

-జస్టిస్ కుమార్ కర్ణాటక హైకోర్టు క్యాడర్‌కు చెందిన వారు.

-2021 అక్టోబర్ 13 వరకు గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు.

-1962 జూలై 14న జన్మించిన ఆయన 1987లో అడ్వకేట్‌గా తన పేరు నమోదు చేసుకున్నారు.

-1999లో కర్ణాటక హైకోర్టులో అడిషనల్ సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు.

-2002లో రీజినల్ ట్యాక్సెస్ అడ్వయిజరీ కిమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు.

-2009 జూన్ 26న కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా పదోన్నతి పొందారు.

-2012 డిసెంబర్ 7న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

Updated Date - 2023-02-12T17:25:32+05:30 IST