Udayanidhi: సీఎం కొడుకు, ఇప్పుడు మంత్రి కూడా అయిన ఉదయనిధి ఆసక్తికర వ్యాఖ్యలు.. నాకు ఉప ముఖ్యమంత్రి పదవా... తెలియదే!

ABN , First Publish Date - 2023-06-10T09:08:16+05:30 IST

‘నాకు ఉప ముఖ్యమంత్రి పదవా? ఆ విషయం గురించి మీరు చెబితే కానీ తెలియలేదే!’ అంటూ రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల

Udayanidhi: సీఎం కొడుకు, ఇప్పుడు మంత్రి కూడా అయిన ఉదయనిధి ఆసక్తికర వ్యాఖ్యలు.. నాకు ఉప ముఖ్యమంత్రి పదవా... తెలియదే!

పెరంబూర్‌(చెన్నై): ‘నాకు ఉప ముఖ్యమంత్రి పదవా? ఆ విషయం గురించి మీరు చెబితే కానీ తెలియలేదే!’ అంటూ రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్థానిక షోళింగనల్లూరులోని సెయింట్‌ జోసెఫ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శుక్రవారం దృష్టి లోపం వున్న విద్యార్థుల కోసం క్రీడా పోటీలను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ‘అచ్చమిల్లై’ స్వచ్ఛంద సంస్థతో కలిసి సెయింట్‌ జోసెఫ్‌ విద్యాసంస్థలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 17 జిల్లాలకు చెందిన సుమారు 200 మందికి పైగా దివ్యాంగులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్‌ జోసెఫ్‌ విద్యా సంస్థల చైర్మన్‌ బాబు మనోహర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశిశేఖర్‌, అచ్చమిల్లై సంస్థ ప్రతినిధి మోనిక తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ... ఖేలో ఇండియా పోటీలు జరిగే ప్రాంతాలు ఎంపిక చేసే పనులు చేపట్టామన్నారు. తొలిసారిగా ఈ పోటీలు రాష్ట్రంలో నిర్వహించేందుకు అంగీకరించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌, కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. చెస్‌ ఒలంపియాడ్‌ విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో, ఖేలో ఇండియా పోటీలు నిర్వహించనున్నామన్నారు. ఈ పోటీల ప్రారంభం, ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి హాజరయ్యే అవకాశముందని, తాము కూడా ఆయన్ని ఆహ్వానిస్తామని తెలిపారు. ఈ పోటీలకు చెన్నై, కోయంబత్తూర్‌, మదురై(Chennai, Coimbatore, Madurai) తదితర ప్రాంతాల్లోని వసతులపై తొలి సమావేశంలో చర్చించామని, రాబోయే సమావేశంలో స్థలాల ఎంపిక చేపడతామని మంత్రి ఉదయనిధి తెలిపారు. ‘మీకు ఉపముఖ్యమంత్రి వస్తుందని ప్రచారం జరుగుతోంది కదా’ అని మీడియా అడగ్గా.. అలాంటి విషయం తనకు తెలియదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

nani4.2.jpg

Updated Date - 2023-06-10T09:08:16+05:30 IST