ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Udhayanidhi Stalin: బీజేపీ ఒక విష సర్పం, దాన్నుంచి విముక్తి పొందాలంటే.. ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-09-11T16:18:12+05:30

కొన్ని రోజుల క్రితం సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి తెరలేపిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. ఈసారి బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ ఒక విష సర్పమని..

కొన్ని రోజుల క్రితం సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి తెరలేపిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. ఈసారి బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ ఒక విష సర్పమని పేర్కొన్న ఆయన.. తమ ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేను పాములకు ఆశ్రయం కల్పించే చెత్తతో పోల్చారు. ఆదివారం తమిళనాడులోని నైవేలీలో డీఎంకే ఎమ్మెల్యే సభా రాజేంద్రన్ ఇంట్లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎంపీ, డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ.రాజా ప్రధాని మోదీని పాముతో పోల్చిన కొన్ని రోజుల తర్వాత ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘మీ ఇంట్లోకి ఒక పాము వచ్చిందంటే, దాన్ని బయటపడేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవ్వదు. అది మీ ఇంటి చుట్టూ ఉండే చెత్తలో దాక్కోవచ్చు. మీరు ఆ చెత్తని తీసేంతవరకు.. ఆ పాము మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది’’ అని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ వ్యవహారాన్ని ప్రస్తుత పరిస్థితితో పోల్చి చూస్తే, తమిళనాడు రాష్ట్రం మన ఇల్లు. విష సర్పం బీజేపీ అయితే, అన్నాడీఎంకే దానికి ఆశ్రయం కల్పించే చెత్త. ఆ చెత్తను తొలగిస్తే తప్ప విష సర్పాన్ని దూరం చేయలేరు. బీజేపీ పార్టీ నుంచి విముక్తి పొందాలంటే.. ముందుగా అన్నాడీఎంకే పార్టీని తొలగించాల్సి ఉంటుంది’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా.. అంతకుముందు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదని.. దీనిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనానికి దారి తీశాయి. ముఖ్యంగా.. బీజేపీ వాళ్లైతే స్టాలిన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఉదయనిధి స్టాలిన్ ఆ పార్టీపై పైవిధంగా ధ్వజమెత్తారు.

Updated Date - 2023-09-11T16:18:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising