ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amit Shah: తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలపై అమిత్‌షా సీరియస్‌

ABN, First Publish Date - 2023-02-28T21:37:46+05:30

తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌ ఉందని అమిత్‌షా బీజేపీ నేతలతో చెప్పారు.

Union Home Minister BJP leader Amit Shah,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ తదితరులు సమావేశంలో పాల్గొని ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సుమారు 3 గంటల పాటు సమావేశం జరిగింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై సోషల్ మీడియా ప్రచారాన్ని నేతలు అమిత్‌ దృష్టికి తీసుకెళ్లారు. అసత్య ప్రచారాలను పట్టించుకోవద్దని, పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని షా నేతలకు సూచించారు. తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలపై అమిత్‌షా సీరియస్‌ అయ్యారు. నేతలంతా కలిసి కష్టపడి పనిచేయాలని ఆదేశించారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌ ఉందని అమిత్‌షా బీజేపీ నేతలతో చెప్పారు. చిన్నచిన్న విషయాలను పక్కనపెట్టి పనిచేయాలన్నారు. మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కార్యాచరణ ఇచ్చారు. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. తర్వాత ఉమ్మడి జిల్లాలవారీగా సమావేశాలు నిర్వహించాలన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో బహిరంగ సభ నిర్వహించాలని అమిత్ షా సూచించారు. పార్టీలోకి చేరికలను వేగవంతం చేయాలన్నారు. తెలంగాణపై తాను సీరియస్‌గా ఉన్నానని, తన ఫోకస్ అంతా తెలంగాణపైనే ఉందని షా చెప్పారు. 2023లో తెలంగాణలో సత్తా చాటి 2024 ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ అధిష్టానం నేతలకు సూచించింది.

మార్చి 12న అమిత్‌షా తెలంగాణకు రానున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ నేతలను ఎండగట్టాలని బీజేపీ అధిష్టానం నేతలకు పిలుపునిచ్చింది. ప్రజా సంగ్రామ యాత్రతో ప్రధాని ప్రశంసలు పొందిన బండి సంజయ్‌కు మరోమారు అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది.

కింది స్థాయి స్పందన బాగుంది.

తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలుండగా 60 మ్యాజిక్ నెంబర్. ఎలాగైనా మ్యాజిక్ నెంబర్ సంపాదించాలని బీజేపీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది.

Updated Date - 2023-02-28T21:44:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!