ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mamata Banerjee : దురహంకారం ఓడింది : మమత బెనర్జీ

ABN, First Publish Date - 2023-05-13T21:26:45+05:30

కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ

Mamata Banerjee
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. మార్పునకు అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చిన కర్ణాటక ప్రజలకు వందనాలు తెలిపారు. కిరాతకమైన నియంతృత్వ, అధికార ఆధిపత్య రాజకీయాలు దారుణంగా ఓడిపోయినట్లు తెలిపారు. ప్రజలు బహుతావాద, ప్రజాస్వామిక శక్తులు గెలవాలని కోరుకుంటే, వారి స్వేచ్ఛా నిర్ణయాన్ని ఎటువంటి కేంద్ర శక్తి ప్రణాళిక అణచివేయలేదని చెప్పారు. ఇది ఈ కథలో నీతి అని, రేపటి కోసం పాఠమని చెప్పారు.

దురహంకారం ఓడిపోయినట్లు కర్ణాటక ఎన్నికల ఫలితాలనుబట్టి తెలుస్తోందన్నారు. విజేతలందరికీ వందనాలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్ర నేత హెచ్‌డీ కుమార స్వామి కూడా మంచి ఫలితాలు సాధించారన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ఎన్నికలు వస్తున్నాయని, వీటిలో కూడా బీజేపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. 2024లో బీజేపీ పాలన అంతానికి ఇది నాంది అని తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీతో పోరాడటానికి తాను అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి మద్దతిస్తానని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందన్నారు.

తొమ్మిదేళ్ల నుంచి వివిధ రాష్ట్రాల్లో ఎదురు దెబ్బలు తిన్న కాంగ్రెస్‌కు కర్ణాటక గెలుపు గొప్ప ఊరటనిచ్చింది. జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, ఈ దెబ్బతో తమ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలను నిర్వహించే సాహసానికి బీజేపీ ఒడిగట్టదన్నారు.

కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ స్పందిస్తూ, దక్షిణాది నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోయిందని, కర్ణాటకలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతోందని అన్నారు.

కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అభినందించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విజయం సాధించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు విశేషంగా కృషి చేశారని ప్రశంసించారు. రానున్న కాలంలో మరింత ఉత్సాహంగా కర్ణాటకకు సేవ చేస్తామని తెలిపారు.

కర్ణాటకలో 224 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 65, కాంగ్రెస్ 136, జేడీఎస్ 19, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి :

JDS KumaraSwamy: కుమారస్వామి గెలిచారు కానీ కొడుకును గెలిపించుకోలేకపోయారు.. అమ్మ త్యాగం వృధా..!

DK Shivakumar: భావోద్వేగంతో కంటతడి పెట్టిన డీకే

Updated Date - 2023-05-13T21:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising