Sri rama navami: ఒక్కసారిగా హనుమంతుడు బొటన వేలంతగా మారి, ఆమె ఉదరంలోకి ప్రవేశించి...!
ABN , First Publish Date - 2023-03-30T11:22:13+05:30 IST
హనుమంతుని జీవనం మనకందరకూ ఆదర్శవంతమైంది.
రామాయణం అంత బలంగా ఆదర్శవంతమైన ఇతిహాసంలా మనందరి మనసుల్లో నాటుకుపోవడానికి కారణం సీతారాములతో పాటు అంతే బలంగా తన పరాక్రమాన్ని, స్వామి భక్తిని చూపిన ధీరుడు, అజేయుడు ఆంజనేయుడు మాత్రమే. హనుమ కూడా రామాయణానికి బలమైవాడు కనుకనే. రామాయణంలో ఆంజనేయుడి పాత్ర ఎంత ఉన్నదో ప్రత్యేకంగా చెప్పక్కరలెద్దు.
రావణాసురుడు సీతను అపహరించగా సీత జాడను వెతకడంలో, రాముడు వానరులతో కడలిపై సేతువు నిర్మించినపుడు కూడా హనుమ గొప్ప పాత్ర పోషించాడు. హనుమంతుని కార్య దీక్ష, సాఫల్యతలు సుందరకాండలో పొందుపరచబడ్డాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయనీ విస్తారమైన విశ్వాసం.
ఆంజనేయుడు రామకార్యార్థియై వెళుతూ ఉండగా సముద్రుడు మైనాకపర్వతాన్ని హనుమకు విశ్రాంతిని ఇవ్వమని ఆదేశించాడు. దానికి హనుమ రామకార్యానికై వెళుతున్నాను ఇప్పుడు విశ్రమించలేనని చెప్పి వెళ్లిపోయాడు.
ఇది కూడా చదవండి: ఆయన్ను కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి..!
యుద్ధకాండ సమయంలోనూ జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ మనస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశ మార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్ళి ఔషదాలను తీసుకువచ్చే ప్రయత్నంలో మొత్తం సంజీవనీ పర్వతాన్నే ఎత్తుకువచ్చాడు. అరణ్యవాసం చేస్తున్న సమయంలో రావణ లంకకు సీత జాడను వెతుకుతూ వెళ్ళినవాడు హనుమ ఒక్కడే.
హనుమంతుని శక్తిని తెలుసుకోడానికి దేవతలు సురసను పంపారు. ఆమె హనుమంతునికి అడ్డుపడింది. ఒక్కసారిగా హనుమంతుడు బొటన వేలంతగా మారి ఆమె ఉదరంలోకి ప్రవేశించి గభాలున ఆమె నోరుమూసుకొనేలోగానే బయటకు వచ్చేస్తాడు. హనుమంతుని యుక్తికి మెచ్చి సురస దీవించింది. సింహిక అనే రాక్షసి హనుమతుడు ఎగురుతుండగా నీటిపై ఉన్న అతని నీడను పట్టి ఆపింది. హనుమంతుడు తన శరీరాన్ని వేగంగా పెంచి ఒక్కసారి తగ్గించుకొని రాక్షసి కడుపులోకి వెళ్ళి పేగులు చీల్చి బయటకు వచ్చాడు.
రావణుడి మరణం తరువాత అయోధ్యకు వెళ్ళి భరతడికి రాముని రాక తెలిపి స్వాగత కార్యక్రమాలు నిర్వహింపచేసించినవాడు హనుమంతుడే! శ్రీ రామ పట్టాభిషేక వేళ సీతమ్మ అమూల్యమైన రత్నహారాన్ని ఇవ్వడమే గాక రాముడు తన సోదరులకు కూడా చూపని ప్రేమ చూపి చిరంజీవిత్వాన్ని, రాబోయే కల్పంలో బ్రహ్మ పదవిని కూడా ప్రసాదించాడు.
హనుమంతుని జీవనం మనకందరకూ ఆదర్శవంతమైంది. ఈ సంకల్పం అనేది ఎంత బలంగా వుంటే అంతే వేగంగా కోరికలు నెరవేరతాయని, హనుమ చేసిన సాహసం బుజువు చేసింది. సంకల్పం బలహీనంగా ఉంటే అప్పుడు కోరికలు అంతే బలహీనం అయిపోతాయి.