Share News

Zodiac Signs: ఈ రాశి వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారట!

ABN , Publish Date - Mar 12 , 2024 | 08:29 AM

రాశిఫలాలు 12-3-2024 - మంగళవారం కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్‌ రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. ఇవాళ ఒక రకంగా అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి.

Zodiac Signs: ఈ రాశి వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారట!

రాశిఫలాలు

12-3-2024 - మంగళవారం కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్‌ రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. ఇవాళ ఒక రకంగా అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు మనసుకు ప్రశాంతత చేకూరుస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. దూరంలో వున్న బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. MESHAM-01.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాలకు సంబంధించి రహస్య సమాచారం అందుకుంటారు. దూరంలో ఉన్న ప్రియతముల కలయిక ఆనందం కలిగిస్తుంది. సినీ, రాజకీయ, న్యాయ, బోధన, విదేశీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. MESHAM-02.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. సమావేశాలు, బృందకార్యక్రమాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. రాజకీయ, న్యాయ రంగాల వారు ఉన్నత పదవులు అందుకుంటారు. పెద్దల సహకారంతో ఆర్థిక వ్యవహరాల్లో లక్ష్యాలు సాధిస్తారు. MESHAM-03.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

అనుకున్న పనులు పూర్తవుతాయి. రాజకీయ, సినీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. ఽప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న పనులు సాధిస్తారు. పెద్దలతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. గౌరవ పదువులు అందుకుంటారు. MESHAM-04.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రక్షణ, బోధన, న్యాయ, రవాణా, రక్షణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో వేడుకలు, సంస్మరణల్లో పాల్గొంటారు. MESHAM-05.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)డ

స్టాక్‌మార్కెట్‌ లావాదేవీల పై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పన్నులు, మ్యూచ్యువల్‌ పండ్స్‌, పెన్షన్‌ లావాదేవీలకు అనుకూలం. MESHAM-06.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

సమావేశాలు, వేడుకలు, విందులు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. అనుబంధాలు బలపడతాయి. కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. .MESHAM-07.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. హోటల్‌, ఆస్పత్రులు, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. MESHAM-08.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

వివాహాది శుభకార్యాలకు అనుకూలమైన రోజు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. విద్యా సంస్థలు, చిట్‌ఫండ్‌లు, ప్రకటనల రంగాల వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులకు శుభప్రదం. MESHAM-09.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. బదిలీలు, మార్పులకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ఇంటికి అవసరమైన వస్తువులు రవాణాకు అనుకూలం.MESHAM-10.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. సోదరీ సోదరుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలకు ఏర్పాట్లు చే సుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.MESHAM-11.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. విలువైన వస్తువుల కొనుగోలు కోసం ఆరా తీస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.MESHAM-FINAL-12.jpg

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Mar 12 , 2024 | 03:01 PM