ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి పోలీస్ అధికారికి అరుదైన గౌరవం

ABN, First Publish Date - 2023-09-06T11:02:11+05:30

అగ్రరాజ్యం అమెరికాలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన భారత సంతతి పోలీస్ అధికారి రోనిల్ సింగ్ (Ronil Singh) కి తాజాగా అరుదైన గౌరవం లభించింది.

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన భారత సంతతి పోలీస్ అధికారి రోనిల్ సింగ్ (Ronil Singh) కి తాజాగా అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియా (California) లోని ఓ హైవేకి ఆయన పేరు పెట్టారు. హైవే 33, స్టుహ్ర్ రోడ్‌లో 'కార్పోరల్ రోనిల్ సింగ్ మెమోరియల్ హైవే' (Corporal Ronil Singh Memorial Highway) ను సెప్టెంబర్ 2న జరిగిన ఓ వేడుకలో ఆవిష్కరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక ఈ సైన్ బోర్డు వెనక సింగ్ కుమారుడు అర్నవ్ 'లవ్ యు పాపా' అని రాయడం కూడా అక్కడి మీడియా కథనాల్లో ప్రచురితమైంది.

కాగా, ఈ పిల్లాడు 2018లో రోనిల్ సింగ్ చనిపోయినప్పుడు ఐదు నెలల పసికందు. తాజాగా జరిగిన ఈ కార్యక్రమానికి తల్లి అనామిక, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యాడు. 2019 సెప్టెంబర్‌లో అసెంబ్లీ రవాణా కమిటీ ద్వారా హైవే 33లోని కొంత భాగానికి సింగ్ పేరు పెట్టాలనే తీర్మానానికి ఆమోదం లభించింది. ఇక సింగ్ మొదట మోడెస్టో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వాలంటీర్‌గా చేరాడు. ఆ తర్వాత టర్లాక్ పోలీస్ విభాగంలో క్యాడెట్, జంతు సేవా అధికారిగా విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో 2018లో క్రిస్మస్ పర్వదినం నాడు రాత్రి ఓవర్ టైం డ్యూటీ చేస్తున్న అతనిపై మద్యం మత్తులో ఓ డ్రైవర్ విచక్షరహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సింగ్‌‌ ప్రాణాలు కోల్పోయాడు.

ఇదిలాఉంటే.. రెండేళ్ల క్రితం విధి నిర్వహణలో ఉండగా దుండగుడి కాల్పులకు ప్రాణాలు కోల్పోయిన సిక్కు పోలీసు అధికారి సందీప్ సింగ్ ధలీవాల్‌ (Sandeep Singh Dhaliwal) కు కూడా అప్పుడు అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమ హ్యూస్టన్‌లోని హారిస్ కౌంటీ పోస్టాఫీసు పేరును 'సందీప్ సింగ్ ధలీవాల్ పోస్టాఫీసు'గా మారుస్తూ అక్కడి యంత్రాంగం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.

UAE: ప్రవాసులూ బీ కేర్‌ఫుల్.. యూఏఈలో ఆ తప్పుకు రూ.2కోట్లకు పైగానే జరిమానా..!

Updated Date - 2023-09-06T11:04:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising