ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: డాలస్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ABN, First Publish Date - 2023-10-03T11:30:07+05:30

డాలస్ (అర్వింగ్) నగరంలోని అమెరికా దేశంలోనే అతి పెద్ద మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

డాలస్, టెక్సాస్ (అక్టోబర్ 2): డాలస్ (అర్వింగ్) నగరంలోని అమెరికా దేశంలోనే అతి పెద్ద మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీకి వందలాది మంది ప్రవాస భారతీయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పుష్పాంజలి ఘటించారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర.. ముఖ్య అతిథిగా హాజరైన కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా (హుస్టన్) డీసీ మంజునాథ్, విశిష్ట అతిథి, ఎన్నో సంవత్సరాలుగా సామజికసేవ చేస్తున్న వాషింగ్టన్ డీసీ నివాసి ఐన రవి పులికి ఆహ్వానం పలికారు. అహింస, సత్యాగ్రహమే ఆయుధాలుగా మహాత్మాగాంధీ భరతమాత దాస్య శృంఖలాలను విడిపించడంలో తన జీవితాన్నే త్యాగం చేశారని ఈ సందర్భంగా డా. తోటకూర అన్నారు.

కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా (హుస్టన్) డీసీ మంజునాథ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సముపార్జనలో గాంధీజీ కృషిని కొనియాడారు. అమెరికా, భారత్ మధ్య ప్రస్తుత సంబంధాలు చాలా బలంగా ఉన్నాయన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితులలో అమెరికాలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి పంపించడం కోసం రవి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన తీరు, ఆయన చేసిన సేవ వెలకట్టలేనివని ప్రశంసించారు. రవి పులిని కాన్సుల్ జనరల్ మంజునాథ్ ప్రత్యేకంగా సన్మానించారు.

ఈ వేడుకలలో పాల్గొన్న అతిథులు శాంతికి సంకేతంగా తెల్లటి పావురాలను పిల్లల కేరింతల మధ్య ఆకాశంలోకి వదిలారు. తెల్లటి దుస్తులు ధరించిన పిల్లలు, యువతీ యువకులు, పెద్దలు ‘గాంధీ శాంతియాత్ర’లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు రావు కల్వల, మురళి వెన్నం, దినేష్ హూడా, కమల్ కౌశిక్, షబ్నం మొద్గిల్, శైలేష్ షా, ఉర్మిత్ సింగ్, సుష్మా మల్హోత్రా తదితర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-03T11:30:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising