ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: లండన్‌లో హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం వేడుకలు

ABN, First Publish Date - 2023-09-29T12:37:15+05:30

హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ (HYFY) లండన్ ఆధ్వర్యంలో 11వ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. లండన్‌కు సమీపంలో ఉన్న రీడింగ్ నగరంలో గణపతి వేడుకలు, నిమజ్జనం జరిగింది.

లండన్: హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ (HYFY) లండన్ ఆధ్వర్యంలో 11వ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. లండన్‌కు సమీపంలో ఉన్న రీడింగ్ నగరంలో గణపతి వేడుకలు, నిమజ్జనం జరిగింది. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గణేశ్‌ విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున రీడింగ్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలే కాకుండా స్థానిక బ్రిటిష్ వాసులు పాల్గొని, ఆట పాటలతో సంబరాలు చేశారు.

‘గణపతి బప్పా మోరియా’, 'జై బోలో గణేష్ మహారాజ్ కి జై' అంటూ వీధులు దద్దరిల్లాయి. బ్రిటన్ వాసులు కూడా తరలి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. సంస్థ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ ప్రాంతం అని, ఎలాగైతే అక్కడ వివిధ ప్రాంతాల, మతాల ప్రజలు కలిసిమెలిసి ఉంటారో అలాగే ఇక్కడ కూడా అందరినీ కలుపుకొని ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికి కృతఙ్ఞతలు తెలిపారు.

6వ రోజు గణపతి హోమం చేయడం జరిగింది. పూజ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డుని జీవన్, సుమన్ గోలి, మధు గులాయిగారి కలిసి వేలం పాటలో 1లక్ష 52వేలకు దక్కించుకోవడం జరిగింది. అనంతరం గణపయ్యకు ఘనమైన పూజలు చేసిన భక్తులు అద్భుత రీతిలో సాగనంపారు. థేమ్స్ నదిలో గణపయ్యలను నిమజ్జనం చేశారు.

అధ్యక్షుడు అశోక్ దూసరి, జాహ్నవి దుసరి, సతీష్ రెడ్డి, శ్రీకత్ రెడ్డి జింకల, సుస్మిత, శ్రీనివాస, లక్ష్మి, హర్ష రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, సుమన్ గోలి, నీలిమ, మధు గులైగారి, భావన, జీవన్, మమత, మహేందర్, శ్వేతా, అనిల్, మల్ల రెడ్డి, శుశమున, శేఖర్, అనిత, హరి నవాబుపేట్, స్నేహ, వీర్, సృజన, సైది రెడ్డి, హారిక యడవల్లి, అభిలాష్ రావు, సమిత, సంతోష్, వర్ష, నాగార్జున, అనూష, వేణు, నీలిమ, భాను, శ్రీకాంత్ జెల్ల, శైలజ, పవన్, మాధురి, నరేష్ జక్కుల, శశి దొడ్లే, మౌనిక అవినాష్, ప్రత్యూష, భూషణ్, మధు, శివ సిన్నం, సంజీవ్, నిహారిక, సురేందర్, రూప్, వీణ, శ్రీమన్నారాయణ, శ్రీకాంత్ రెడ్డి, సంధ్య, సత్యపాల్ రెడ్డి, విద్య, మోహన్, త్రివేద్, నాగరాజ్త దితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-29T12:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising