RGIA: కువైత్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులు.. అనుమానంతో చెక్ చేసిన అధికారులకు షాక్..!
ABN, First Publish Date - 2023-09-07T09:15:03+05:30
కువైత్ నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Rajiv Gandhi International Airport) వచ్చిన ఇద్దరు ప్రయాణికుల తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిపై కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: కువైత్ నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Rajiv Gandhi International Airport) వచ్చిన ఇద్దరు ప్రయాణికుల తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిపై కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో మొదటి ప్రయాణికుడు అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండడం గమనించి టాయిలెట్ (Toilet) వైపు వెళ్లిపోయాడు. దాంతో అధికారులు అతణ్ని అనుసరించారు. తీరా.. వెళ్లి చూస్తే అక్కడి డస్ట్‌బిన్‌లో 1253 గ్రాముల బంగారం దొరికింది. వెంటనే సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించాడు.
ఆ బంగారం విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం రూ. 75,80,650 ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. పసిడి (Gold) ని సీజ్ చేసిన అధికారులు ప్రయాణికుడి (Passenger) ని కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం అరెస్ట్ చేశారు. ఇక రెండో కేసులో.. కువైత్ నుంచి వచ్చిన ప్రయాణికుడిపై అనుమానంతో లగేజీని స్కాన్ చేయగా లోపల చిన్న చిన్న ముక్కల రూపంలో దాచి తీసుకువచ్చిన 151 గ్రాముల బంగారం దొరికింది. దీని విలువ రూ. 9,16,570 ఉంటుందని కస్టమ్స్ అధికారులు (Customs Officials) తెలిపారు. బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇలా కువైత్ (Kuwait) నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి సుమారు రూ.85లక్షలు విలువ చేసే బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు సీజ్ చేశారు.
Kuwait: ప్రవాసులకు కువైత్ మరో ఝలక్.. ఆ దేశం విడిచివెళ్లేవారు ఇకపై తప్పనిసరిగా..!
Updated Date - 2023-09-07T09:15:03+05:30 IST