India-Canada row: కెనడాలో భారత విద్యార్థులకు స్టడీ చాలా రిస్కీ.. మనోళ్ల ముందు ఉన్న ఆరు ఆల్టర్నేటివ్స్ ఏవంటే..
ABN, First Publish Date - 2023-09-24T12:06:57+05:30
ప్రస్తుతం కెనడా-భారత్ మధ్య పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఘర్షణలు, భద్రతా సమస్యలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కనిపించడం లేదు.
India-Canada row: ప్రస్తుతం కెనడా-భారత్ మధ్య పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఘర్షణలు, భద్రతా సమస్యలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో భారత విద్యార్థులు (Indian Students) కెనడాలో తమ స్టడీ ప్రణాళికలను మరోసారి సమీక్షించుకుంటున్నారు. భారత్, కెనడా దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం రోజురోజుకీ అంతకంతకు ముదురుతుండడం, భద్రత గురించి ఆందోళనల కారణంగా ఆ దేశంలో చదువుకోవడానికి మనోళ్లు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కొందరు విద్యార్థులు తమ అడ్మిషన్‌ను పోస్ట్‌పోన్ చేస్తుంటే, మరికొందరు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్ వంటి ఇతర దేశాలవైపు మొగ్గుచూపుతున్నారు. ఎందుకంటే ఈ ఆరు దేశాలలో మంచి ఎడ్యుకేషన్‌తో పాటు ఇంగ్లీష్ కూడా మాట్లాడటం అనేది భారత విద్యార్థులకు కలిసొచ్చే ప్రధాన అంశం.
దీనివల్ల మనోళ్లకు కమ్యూనికేషన్ సమస్య ఉండదు. క్లాస్‌మేట్స్, ప్రొఫెసర్స్ (Professors), బయట వ్యక్తులతో ఇంగ్లీష్‌లో చాలా ఈజీగా మాట్లాడుకోవచ్చు. భద్రతా సమస్యలు కూడా చాలా తక్కువ అనే చెప్పాలి. అంతేగాక ఈ ఆరు దేశాల్లో ఎన్నారైలు అధికంగా ఉంటారు. కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఉద్యోగ అవకాశాలు కూడా చాలా బెటర్‌గా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరోవైపు ప్రస్తుతం కెనడాలోని భారతీయ విద్యార్థులు ఉండేందుకు ఇళ్లు, ఉపాధి కోసం ఉద్యోగాలు దొరకని పరిస్థితి దాపురించింది. దీంతో మన విద్యార్థులు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే కెనడాకు బదులుగా పైన పేర్కొన్న ఆరు దేశాలతో పాటు మరికొన్ని దేశాలు కూడా మనోళ్లకు ఆల్టర్నేటివ్స్‌గా నిలుస్తున్నాయి.
Emirates Draw: ఈమె ఎంత అదృష్టవంతురాలు.. పని చేయకుండానే నెలనెలా రూ.5.65 లక్షలు.. అలా 25 ఏళ్లపాటు..!
Updated Date - 2023-09-24T12:06:57+05:30 IST