ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kuwait: కువైత్‌కు రికార్డు స్థాయిలో పెరిగిన భారత్ ఎగుమతులు

ABN, First Publish Date - 2023-10-10T12:38:19+05:30

2022-23 ఆర్థిక సంవత్సరంలో కువైత్‌కు ఇండియా ఎగుమతులు భారీగా పెరిగాయి. ఏకంగా 25.6శాతం మేర పెరిగినట్లు తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (Federation of Indian Export Organisations) వెల్లడించింది.

కువైత్ సిటీ: 2022-23 ఆర్థిక సంవత్సరంలో కువైత్‌కు ఇండియా ఎగుమతులు భారీగా పెరిగాయి. ఏకంగా 25.6శాతం మేర పెరిగినట్లు తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (Federation of Indian Export Organisations) వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కువైత్‌కు భారతీయ ఎగుమతులు 1.24 బిలియన్ డాలర్లుగా ఉంటే.. ప్రస్తుతం అది 1.56 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఎఫ్ఐఈఓ (FIEO) తెలిపింది. ఈ వృద్ధి ఇరు దేశాల మధ్య బలమైన వాణిజ్య భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొంది. ఈ మేరకు తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా ప్రకటించింది. ఇక సెప్టెంబర్ ప్రారంభంలో కువైత్‌లోని భారత రాయబారి ఆదర్శ్ స్వైకా (Adarsh Swaika) మాట్లాడుతూ.. భారత్-కువైత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి (12.5 బిలియన్ డాలర్లు) చేరుకుందని చెప్పారు. కాగా, కువైత్‌కు బియ్యం, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ వస్తువులతో సహా అనేక రకాల వస్తువులను ఇండియా ఎగుమతి చేస్తున్న విషయం విదితమే. అదే సమయంలో కువైత్ నుంచి మనకు భారీ మొత్తంలో ముడి చమురు దిగుమతి అవుతోంది.

UAE: గోల్డెన్ వీసాతో కలిగే ఎనిమిది అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..

Updated Date - 2023-10-10T12:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising