ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: ఎన్నారై చిన్న పొరపాటు.. ఏకంగా రూ. 57లక్షలు కొట్టేసిన స్కామర్లు.. అసలేం జరిగిందంటే..!

ABN, First Publish Date - 2023-09-23T13:32:46+05:30

ఆన్‌లైన్ మోసాలు (Online Frauds) రోజురోజుకీ పెరిపోతున్నాయి. ఎప్పటికప్పుడు అప్‌డేటేడ్ సాంకేతికతను ఉపయోగిస్తూ స్కామర్లు సరికొత్త మార్గాలలో దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఎన్నారై (NRI) బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసి దోచేశారు.

ఎన్నారై డెస్క్: ఆన్‌లైన్ మోసాలు (Online Frauds) రోజురోజుకీ పెరిపోతున్నాయి. ఎప్పటికప్పుడు అప్‌డేటేడ్ సాంకేతికతను ఉపయోగిస్తూ స్కామర్లు సరికొత్త మార్గాలలో దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఎన్నారై (NRI) బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసి దోచేశారు. ఒకటికాదు రెండుకాదు ఏకంగా రూ. 57లక్షలు కొట్టేశారు. ఆ ఎన్నారై చేసిన ఒక చిన్న పొరపాటు ఇలా భారీ మూల్యం చెల్లించుకునేలా చేసింది. ఇంతకీ ఆ ఎన్నారై చేసిన పొరపాటు ఏంటో తెలుసా? తన బ్యాంకు ఖాతాకు లింక్ చేసి ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేయకపోవడమే. అవును మీరు విన్నది నిజమే. అదేంటి ఫోన్ నంబర్ అప్‌డేట్ చేయకపోతే.. చోరీ ఎలా సాధ్యమైందనేగా మీ అనుమానం? అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

వివరాల్లోకి వెళ్తే.. రమణదీప్ గ్రేవాల్ అనే ఎన్నారై బ్రిటన్‌ (Britain) లో ఉంటాడు. అతనికి పంజాబ్ రాష్ట్రం లుథియానాలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచీలో ఖాతా ఉంది. అయితే ఆయన చాలా కాలంగా ఈ అకౌంట్‌కు లింక్ అయ్యి ఉన్న ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేయలేదు. దాంతో అది డీయాక్టివేట్ అయిపోయింది. ఇక ఇదే అదునుగా భావించిన ఆ బ్యాంకు రిలేషన్‌షిప్ మేనేజర్ సుఖ్‌జీత్ సింగ్ కొంత మంది స్కామర్ల (Scammers) తో చేతులు కలిపాడు. వారితో కలిసి ఇతర వ్యక్తుల ఫోన్ నంబర్‌ను దానికి లింక్ చేశాడు.

ఇలా చేసినందుకు అతడు రూ. 14లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నారై ఖాతా నంబర్‌తో సహా అకౌంట్ యాక్సెస్ మొత్తం ఆ స్కామర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో వారు ఓటీపీల ద్వారా బ్యాంక్ నెట్ బ్యాంకింగ్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఖాతాకు లింక్ చేసిన ఇమెయిల్‌ను సైతం మార్చేశారు. ఆ తర్వాత ఎన్నారై ఖాతాకు బెనిఫీషియరీలను యాడ్ చేసి దాని ద్వారా ఏకంగా రూ. 57లక్షలకు పైగా వారి బ్యాంక్ అకౌంట్‌లకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు.

ఈ క్రమంలో తన బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు మాయమవుతున్నట్లు గుర్తించిన గ్రేవాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఎన్నారై ఫిర్యాదు మేరకు లుథియానా పోలీసులు కేసు నమోదు చేసి, స్కామర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అసలు సూత్రధారిగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) రిలేషన్‌షిప్ మేనేజర్ సుఖ్‌జిత్ సింగ్‌ను గుర్తించారు. ఆయనతో పాటు బీహార్‌కు చెందిన లవ్ కుమార్, గజియాపూర్‌కు చెందిన నిలేష్ పాండే, ఢిల్లీకి చెందిన అభిషేక్‌ను అరెస్ట్ చేశారు.

మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ఆ నలుగురి కోసం గాలిస్తున్నారు. అలాగే నిందితుల నుంచి రూ. 17.35 లక్షలను రికరీ చేయడంతో పాటు వివిధ బ్యాంక్ ఖాతాల్లోని రూ. 7.24లక్షల మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మిగిలిన వినియోగదారులకు కీలక సూచన చేశారు. ఒకవేళ మీ ఫోన్ నంబర్ మారినా లేక కొత్త నంబర్ తీసుకున్నా.. వెంటనే బ్యాంకులో కూడా అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ఆన్‌లైన్ మోసాలకు బలికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

Big Ticket: అదృష్టం అంటే ఈ భారతీయ డ్రైవర్‌దే.. ఒక్కసారి లాటరీ తగలడమే కష్టం అనుకుంటే.. మనోడికి ఏకంగా..

Updated Date - 2023-09-23T13:38:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising