ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI TDP Kuwait ఆధ్వర్యంలో 'మేము సైతం బాబు గారికి తోడుగా' కార్యక్రమం

ABN, First Publish Date - 2023-09-16T11:32:57+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ 'మేము సైతం బాబు గారికి తోడుగా' అనే కార్యక్రమాన్ని ఎన్నారై టీడీపీ కువైత్ (NRI TDP Kuwait) ఆధ్వర్యంలో ఓమెరియా పార్క్‌లో శుక్రవారం సాయంత్రం నిర్వహించారు.

NRI TDP Kuwait: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ 'మేము సైతం బాబు గారికి తోడుగా' అనే కార్యక్రమాన్ని ఎన్నారై టీడీపీ కువైత్ (NRI TDP Kuwait) ఆధ్వర్యంలో ఓమెరియా పార్క్‌లో శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూడా పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. అలాగే భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు కలిసి చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి మాట్లాడుతూ.. అభివృద్ధి ప్రదాత, సాంకేతిక విప్లవం తెచ్చిన నాయకుడు, యువతకు ఉద్యోగాల రూపకల్పనలో అహర్నిశలు శ్రమించిన నాయకుడికి ఈ రోజు రాష్ట్రంలో ఉండే వైసీపీ ప్రభుత్వం చేసిన ఘోరమైన అవమానం చరిత్రలో నిలిచిపోతుంది అని అన్నారు. భవిష్యత్‌లో విదేశీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావని తెలిపారు. దీని వల్ల వారు చంద్రబాబును జైలులో పెట్టాము అని పైశాచిక ఆనందం పొందుతున్నారు తప్ప యువత భవిష్యత్‌పై దెబ్బ కొట్టామనే నిజాన్ని వారు గ్రహించలేక పోతున్నారని దుయ్యబట్టారు.

ప్రభుత్వం దగ్గర బాబు నిధులు పక్క దారి పట్టించాడు అనే ఆధారాలు ఉంటే కోర్టులో చూపించాలని తెలిపారు. అవి చూపించకుండా సజ్జల స్క్రిప్ట్ తీసుకొని సీఐడీ చీఫ్ మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమేనని విమర్శించారు. మా నాయకుడు ఎటువంటి తప్పు చేయరని అన్నారు. ఆయన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని, రాజ్యాంగాన్ని గౌరవించే నాయకుడు అని తెలిపారు. ఇక జనసేన నాయకులు జిలకర మురళి, అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఎఫ్ఐఆర్‌లో పేరు లేకున్నా అరెస్ట్ చేయడం చట్టాన్ని అపహస్యం చేయడమేనని తెలిపారు. మీ దగ్గర ఋజువులు ఉంటే ప్రజలకు తెలపాలని, కక్ష సాధింపు రాజకీయాలు రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్తుకు మంచివి కావు అని ప్రభుత్వానికి హితువు పలికారు. తమ నాయకుడి ఆదేశాల మేరకు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల కోసం వచ్చే ఎన్నికల్లో చిత్తశుద్ధితో టీడీపీకి మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు. టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోరాడి ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని తెలిపారు.

ప్రధాన కార్యదర్శి మల్లి మారోతు మాట్లాడుతూ.. ఈ రాజకీయ ఉన్మాది రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు చేయడంతో పాటు ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం మానుకొని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిది అని తెలిపారు. మా నాయకుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వెనిగల్ల బాలకృష్ణ, పిడికిటి శ్రీనివాస్, మల్లారపు భాస్కర్, పత్తి సుబ్బారాయుడు, చిన్న రాజు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు మోహన్ రాచూరి, రమేష్ కొల్లపనేని, ఓలేటి రెడ్డయ్య, గుండయ్య నాయుడు, మహేష్, శ్రీకాంత్ చింతల, రాజేష్, హేమంత్ రాయల్, శ్రీను రాయల్, నాలుగు గవర్నరెట్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే మైనార్టీ నాయకులు ముస్తక్ ఖాన్, అర్షద్, కరీం, బీసీ అధ్యక్షులు శంకర్ యాదవ్, కాపు సంఘం నాయకులు, తెలుగు యువత అధ్యక్షులు మురళి దుగ్గినేని, శ్రీను నాయుడు, మురళి కేశినేని, మల్లిశెట్టి రవి, పరిటాల ట్రస్ట్ నరసింహులు, మహిళా నాయకురాలు నారాయణమ్మ, నిర్మలమ్మ, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొని తమ ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడుకి తమ సంఘీభావం తెలిపారు.

Updated Date - 2023-09-16T11:32:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising