ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TANA: 'తానా' మహాసభల వేదికపై అస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్‌

ABN, First Publish Date - 2023-06-18T08:55:51+05:30

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. తెలుగు సినీరంగంలో పాటల రచయితగా ఉన్న చంద్రబోస్‌ను తానా మహాసభలకు ఆహ్వానించినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి తెలిపారు.

తెలుగు పాటను విశ్వ వేదిక మీద నిలబెట్టి భారతదేశం తరఫున ఆస్కార్‌ పురస్కారం అందుకున్న తొలి గేయ రచయితగా చంద్రబోస్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజనల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు వచ్చింది. ఈ పాటను రాసిన చంద్రబోస్‌ను అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఎంతోమంది అభినందించారు. అలాంటి చంద్రబోస్‌‌తో నేరుగా మాట్లాడే అవకాశాన్ని తానా మహాసభలు కల్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా తానా మహాసభలకు వచ్చి చంద్రబోస్‌ మాటలను, తెలుగు పాటలోని గొప్పదనాన్ని ఆయన మాటల్లోనే వినండి. ఆయనతో కలిసి మాట్లాడే అవకాశాన్ని వదులుకోకండి. మహాసభల్లో పాల్గొనేందుకోసం వెంటనే మీ పేర్లను రిజిష్టర్‌ చేసుకోండి.

Updated Date - 2023-06-18T08:55:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising