TANA: తానా మహాసభలకు ప్రత్యేక అతిథిగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత ధాజీ
ABN , First Publish Date - 2023-03-23T12:40:12+05:30 IST
ప్రతీ రెండేళ్లకు ఓసారి ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా మహాసభల’ను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 23వ తానా మహాసభలు జూలై నెల 7, 8, 9వ తారీఖుల్లో ఫిలడెల్ఫియాలో జరగబోతున్నాయి.
ప్రతీ రెండేళ్లకు ఓసారి ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా మహాసభల’ను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 23వ తానా మహాసభలు జూలై నెల 7, 8, 9వ తారీఖుల్లో ఫిలడెల్ఫియాలో జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన కార్యక్రమాలను ఇప్పటికే తానా బృందం యుద్ధ ప్రాతిపదికన చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ మహాసభల్లో పాల్గొనబోయే ఓ ముఖ్య అతిథి గురించి తానా బృందం వివరాలను వెల్లడించింది. 23వ తానా మహాసభలకు ప్రత్యేక అతిథిగా కమలేష్ దేశాయ్‌భాయ్ పటేల్‌ను ఆహ్వానిస్తున్నామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. కమలేష్ దేశాయ్‌భాయ్ పటేల్‌ను ధాజీ అని పిలుస్తూ ఉంటారు.
ఆధ్యాత్మికత కోసం విశేష కృషి చేస్తున్న ఆయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 22వ తారీఖున పద్మభూషణ్ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. Shri Ram Chandra Mission,Heartfulness Institute, Heartfulness Education Trust వంటి స్వచ్ఛంద సంస్థలను ఆయన ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రాలలో ఒకటైన కన్హ శాంతి వనాన్ని అభివృద్ధి చేసి విశేష సేవలందిస్తున్న ధాజీకి పద్మభూషణ్ సత్కారం రావడం పట్ల తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, 23వ మహాసభల సమన్వయకర్త పొట్లూరి రవి హర్షం వ్యక్తం చేశారు.
TANA: జూలైలో తానా మహాసభలు.. న్యూజెర్సీలో ఎన్నారైలతో ఘనంగా సన్నాహక సమావేశం (పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి)
ఇదిలా ఉండగా.. తానా మహాసభల నిర్వహణకు ముందే అమెరికాలోని వివిధ నగరాల్లో సన్నాహక సభలను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నిర్వహిస్తోంది. ఇటీవల అమెరికాలోని గార్డెన్ స్టేట్ అని పిలిచే న్యూ జెర్సీ రాష్ట్రంలో 23వ తానా మహాసభల సన్నాహక ఫండ్ రైసింగ్ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి వందలాది మంది ఎన్నారైలు పాల్గొన్నారు. అక్కడకి వచ్చిన తెలుగువారితో ఎడిసన్ లోని రాయల్ అల్బెర్ట్స్ పాలస్ అంతటా సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమనికి హాజరై, గొప్ప ఔన్నత్యంతో విరాళలు అందించిన పలువురు దాతలను ఘనంగా తానా బృందం సత్కరించింది. ఈ సందర్భంగా విచ్చేసిన తానా సభ్యులు ఇటీవల మరణించిన ప్రముఖ దర్శకులు విశ్వనాధ్, శ్రీమతి జయలక్ష్మి గార్లకి, సినీనటుడు నందమూరి తారక రత్నకు ఘనంగా నివాళి అర్పించారు.