BRS Manifesto దేశానికే ఆదర్శం: రాధారపు సతీష్ కుమార్
ABN, First Publish Date - 2023-10-17T07:17:48+05:30
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలు సబ్బండవర్ణాల ప్రజల సంక్షేమానికి కృషి చేసేలా ఉన్నాయని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ తెలిపారు.
BRS Manifesto: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలు సబ్బండవర్ణాల ప్రజల సంక్షేమానికి కృషి చేసేలా ఉన్నాయని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ తెలిపారు. కేసీఆర్ విడుదల చేసిన ప్రజా మ్యానిఫెస్టో ఆచరణాత్మకంగా, విశ్వసనీయంగా ఉందన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు సైతం హర్షిస్తున్నారని పేర్కొన్నారు. 2018 ఎన్నికల్లో ప్రకటించిన మ్యానిఫెస్టోలోని అంశాలన్నింటినీ వందశాతం పూర్తిచేసిన ఘనత కేసీఆర్ సర్కార్‌ది మాత్రమేనని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో నేడు దేశానికే ఆదర్శమని, ఇది కేవలం రాబోయే ఎన్నికల కోసం కాకుండా భవిష్యత్‌తరాలకు ఉపయోగపడేలా ఉందని కొనియాడారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా నిలిచింది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాల డిపాజిట్ గల్లంతు పక్కా అని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాల మానిఫెస్టోచూస్తే అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అన్నట్లు ఉన్నదని విమర్శించారు. 2023లో మూడో ఎన్నికను శాసించేది ముమ్మాటికీ మన పదేళ్ల సమగ్ర ప్రగతి ప్రస్థానం అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు వారి పార్టీలో అభ్యర్థులు లేక కనీసం ఇప్పటివరకు ఒక అభ్యర్థిని కూడా ప్రటకరించుకోలేని స్థితిలో ఉన్నారని చెప్పుకొచ్చారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వినూత్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా తాము బాధ్యతతో పనిచేస్తామన్నారు. ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని పార్టీలకు తగిన బుద్ది చెప్పి, బీఆర్‌ఎస్ పార్టీని వంద సీట్లకు పైగా గెలిపించి కేసీఆర్‌ని మరోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేయడం తథ్యమని చెప్పారు. ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ బృందం త్వరలో తెలంగాణ అంతటా పర్యటించి విసృత ప్రచారం చేసి, పార్టీ గెలుపుకు కృషి చేస్తామని సతీష్ కుమార్ తెలిపారు.
Updated Date - 2023-10-17T07:17:48+05:30 IST