ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Khalistan supporters: కెనడాలో కొత్త టెన్షన్.. సోషల్ మీడియాలో కొత్త దారుల్లో ఖలిస్థాన్ మద్ధతుదారులు ప్రచారం..

ABN, First Publish Date - 2023-07-21T13:52:53+05:30

అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడాలో ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాదులు రెచ్చిపోతున్న విషయం తెలిసిందే.

Khalistan supporters: అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడాలో ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాదులు రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. భారత ఎంబసీ కార్యాలయాలపై దాడి, దౌత్య సిబ్బందికి బెదిరింపులు, హిందూ ఆలయాల ధ్వంసం, తోటి భారతీయులపై దాడులతో హల్‌చల్ చేస్తున్నారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు తెరలేపి, దేశ అంతర్గత భద్రతకు విఘాతం కలిగించేందుకు కుట్ర చేస్తున్నారు. అయితే, ఈ కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకుగాను కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలు, ఇండియన్ మిషన్‌లను లక్ష్యంగా చేసుకోవడం వరకు ఇటీవల సోషల్ మీడియాలో ఖలిస్థాన్ అనుకూల 'బాట్ యాక్టివిటీ' (Bot activity) పెరిగినట్లుగా నిఘా వర్గాలు వెల్లడించాయి.

2022 వేసవిలో దేశంలోని హిందూ దేవాలయాలు, విగ్రహాలు, మహాత్మా గాంధీ విగ్రహాలపై దాడులు జరగడంతో బాట్ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో పాకిస్థాన్‌కు (Pakistan) చెందిన పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రమేయాన్ని కూడా నిఘా సంస్థలు గుర్తించిన విషయం విదితమే. ట్విట్టర్‌ను (Twitter) పోస్టులతో ముంచెత్తడానికి కొన్ని రోజుల ముందు నుంచే కార్యాచరణ ఉంటుంది. ప్రత్యేకమైన ఈవెంట్‌లలో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు, విధ్వంసానికి సంబంధించిన ట్వీట్‌లు ఏకకాలంలో చేయబడ్డాయి. ప్రిన్స్‌టన్, న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న నెట్‌వర్కింగ్ కంపెనీ ఎన్‌సీఆర్ఐ (Network Contagion Research Institute) ద్వారా విడుదల చేయబడిన రిపోర్టులో తెలిపిన విధంగా కార్యాచరణ ఉంటుందని ఓ ప్రముఖ జాతీయ మీడియా న్యూస్ ఏజెన్సీ తన కథనంలో పేర్కొంది.

H-1B Visa: హెచ్ 1బీ వీసాదారులకు వర్క్ పర్మిట్.. కెనడా పథకానికి భారీ స్పందన..!

ఈ ఖాతాల నిర్వహణ పాకిస్థాన్ వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని ఎన్‌సీఆర్ఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జాక్ డోనోహ్యూ (Jack Donohue) చెప్పుకొచ్చారు. కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికాలోని దౌత్యవేత్తలను టార్గెట్‌గా చేసుకుని 'కిల్ ఇండియా' (Kill India) పోస్టర్‌లను ఈ బాట్ గ్రూప్‌లు వ్యాప్తి చేశాయి. బాట్‌లు ఇటీవల భారతీయ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని జూలై 8న ఒట్టావా, టొరంటో, వాంకోవర్‌లోని తమ మిషన్‌ల వెలుపల నిరసనలను విస్తృతం చేశారు.

US: అగ్రరాజ్యంలో విషాదం.. భారత విద్యార్థినిపై పిడుగుపాటు.. మెదడు దెబ్బతిని కోమాలోకి..


Updated Date - 2023-07-21T13:53:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising