TS BJP : ఢిల్లీ నుంచి ఈటల, కోమటిరెడ్డికి పిలుపు.. కాకరేపుతున్న బండి కామెంట్స్.. ఏదో తేడా కొడుతోందే..!
ABN, First Publish Date - 2023-06-23T15:52:32+05:30
అవును.. ఢిల్లీకి (Delhi) రావాలని తెలంగాణ బీజేపీ నేతలు (BJP Leaders) ఈటల రాజేందర్ (Etela Rajender) , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి (Komati Reddy Rajagopal Reddy) పిలుపొచ్చింది..! రెండ్రోజులకోసారి పార్టీ మారుతున్నారని, బీజేపీలో అసంతృప్తిగానే కొనసాగుతున్నారని వార్తలు వస్తుండటంతో ఈ ఇద్దరి విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలని అగ్రనేతలు ఫిక్స్ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం..
అవును.. ఢిల్లీకి (Delhi) రావాలని తెలంగాణ బీజేపీ నేతలు (BJP Leaders) ఈటల రాజేందర్ (Etela Rajender) , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి (Komati Reddy Rajagopal Reddy) పిలుపొచ్చింది..! రెండ్రోజులకోసారి పార్టీ మారుతున్నారని, బీజేపీలో అసంతృప్తిగానే కొనసాగుతున్నారని వార్తలు వస్తుండటంతో ఈ ఇద్దరి విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలని అగ్రనేతలు ఫిక్స్ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే హస్తినకు రావాలని ఫోన్ కాల్ వచ్చిందట. ఈటల, కోమటిరెడ్డి అసంతృప్తికి కారణాలేంటి..? తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన కామెంట్స్ ఏంటి..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
ఇదీ అసలు కథ..!
బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్.. సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఈ ఇద్దరి అడుగులు ఎటువైపు పడబోతున్నాయన్న విషయం ఆసక్తిని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో వీరిద్దరూ తమ పార్టీలోకి వస్తారంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తుండగా.. నేతలు మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. తనకు కీలక పదవి ఇస్తామన్న హామీని అమలుచేయకపోవడంతో పార్టీ నాయకత్వం వైఖరిపై ఈటల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ను (BRS) వీడి బీజేపీలో చేరిన ఈటలకు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే.. అందుకు అనుగుణంగా ప్రకటన వెలువడకపోవడంతో ఈటల అసహనానికి గురవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు.. రాజగోపాల్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే. ఈ మధ్యే తన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkatareddy) పార్టీలోకి రావాలని ఆహ్వానించారని.. ఆయన కూడా సుముఖంగానే ఉన్నారని వార్తలు వచ్చాయి. రెండు మూడ్రోజులు వార్తలు వస్తుండటం.. కనీసం కోమటిరెడ్డి బ్రదర్స్ ఖండించకపోవడంతో ఇది మరింత చర్చనీయాంశమైంది. అంతేకాదు.. బ్రదర్స్ ఇద్దరూ హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గమైన ఎల్బీనగర్‌పై (LB Nagar) కన్నేశారని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ నేత ఎవరూ లేరు.. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో పరిస్థితులు సర్లేవ్.. అందుకే ఎల్బీనగర్ అయితే బాగుంటుందని రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.
పిలుపు వెనుక..?
తెలంగాణ బీజేపీలో జరుగుతున్న ఈ వరుస పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అగ్రనేతలు.. ఈటల, కోమటిరెడ్డిని ఢిల్లీకి రావాలని కబురు పంపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఇద్దర్నీ కూర్చోబెట్టి కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా చర్చిస్తారని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరూ ఢిల్లీకెళ్తారా లేదా.. ఈ లోపే ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు.. ఈ ఇద్దరి పార్టీ మార్పుపై బండి సంజయ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మునిగిపోయే నావ కాంగ్రెస్‌లోకి బీజేపీ నేతలెవరూ ఎవరూ వెళ్ళరు. పార్టీ మార్పుపై ఎవరి ఆలోచనలు వారివి. డిపాజిట్లు రాని.. అభ్యర్థులు లేని కాంగ్రెస్‌లోని ఎవరూ వెళ్ళరు. ఎన్నికలు వస్తున్నందుకే కేసీఆర్‌కు అమరవీరులు గుర్తొచ్చారు’ అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. బండి వర్గానికి ఈటల వర్గానికి అస్సలు పడట్లేదన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఎవరి ఆలోచనలు వారివి అని ఆయన వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. ప్రస్తుతం రాజగోపాల్, రాజేందర్ ఇద్దరూ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుండగా.. ఢిల్లీ నుంచి పిలుపొచ్చిందన్న వార్తతో ఈ ఎపిసోడ్ ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు లేనట్లే అనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.
Updated Date - 2023-06-23T15:55:53+05:30 IST