ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sukesh Vs Kavitha : సుకేష్ చెప్పినవన్నీ అక్షరాలా జరిగిపోతున్న వేళ.. కవితపై చేసిన ఈ ఒక్క కామెంట్‌తో బీఆర్ఎస్‌ శ్రేణుల్లో పెరిగిపోయిన టెన్షన్..

ABN, First Publish Date - 2023-04-15T22:58:58+05:30

సుకేష్ చంద్రశేఖర్.. (Sukesh Chandrasekhar) ఇప్పుడీ పేరు మీడియాలో (Media), సోషల్ మీడియాలో (Social Media) ఎక్కడ చూసినా వినిపిస్తోంది.. కనిపిస్తోంది కూడా. ఇప్పుడు ఈయన చుట్టూనే రాజకీయం తిరుగుతోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుకేష్ చంద్రశేఖర్.. (Sukesh Chandrasekhar) ఇప్పుడీ పేరు మీడియాలో (Media), సోషల్ మీడియాలో (Social Media) ఎక్కడ చూసినా వినిపిస్తోంది.. కనిపిస్తోంది కూడా. ఇప్పుడు ఈయన చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ సింగిల్ స్క్రీన్ షాట్ రిలీజ్ చేసినా సంచలనమే.. ఇక లెటర్ రిలీజ్ చేశాడంటే సంబంధిత వ్యక్తి తాలుకూ పార్టీ, రాజకీయాలను షేక్ చేసేదే అవుతోంది. భారతదేశంలోనే పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్ట్‌లు, విచారణ జరుగుతున్న తరుణంలో సుకేష్ రిలీజ్ చేస్తున్న లెటర్‌లు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఓ రేంజ్‌లోనే చర్చనీయాంశం అవుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే సుకేష్ రిలీజ్ చేసిన లెటర్‌లోని విషయాలు ఒక్కొక్కటిగా నిశితంగా పరిశీలిస్తే.. ఈయన ఏం చెబుతున్నారో అవన్నీ అక్షరాలా జరిగిపోతున్నాయ్. ఇంతకీ సుకేష్ ఇప్పటి వరకూ ఏం చెప్పాడు.. చెప్పిన వాటిలో ఏమేం జరిగాయ్..? నిన్న, మొన్న ఏం చెప్పాడు..? ఏం జరిగాయ్.. ఇప్పుడు బీఆర్ఎస్‌ గురించి.. ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) గురించి సుకేష్ ఏమన్నాడు..? ఎందుకింతలా బీఆర్ఎస్ (BRS) భయపడిపోతున్నాయ్..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

ఇదీ అసలు కథ..

సుకేష్ చంద్రశేఖర్‌ రిలీజ్ చేసే లెటర్‌లో ఏయే విషయాలు అయితే ప్రస్తావిస్తున్నాడో.. అవన్నీ అక్షరాలా నిజమైపోతున్నాయ్.. రోజుల వ్యవధిలోనే జరిగిపోతున్నాయ్. రానున్న రోజుల్లో కేజ్రీతో, సత్యేంద్రజైన్‌తో తాను జరిపిన చాటింగ్‌ మొత్తాన్నీ బయటపెడతానని, ఆ ట్రైలర్‌ చూసి సిగ్గుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ముఖం చెల్లకుండా పోతుందని హెచ్చరించాడు. ఇలా సుకేష్ చెప్పిన రోజుల వ్యవధిలోనే మరో లేఖను రిలీజ్ చేయడం.. అన్నట్లుగానే శుక్రవారం నాడు సీబీఐ నుంచి కేజ్రీవాల్‌కు నోటీసులు రావడంతో ఆప్ శ్రేణులు అవాక్కయ్యాయి. ఈయన చెప్పినదంతా ఎలా జరుగుతోంది..? ఇదంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోందా..? లేకుంటే యాదృచ్ఛికమా..? అని అందరి మనసుల్లో ప్రశ్నలు మెదులుతున్నాయ్. శనివారం రిలీజ్ చేసిన 12 పేజీల లేఖలో ఏకంగా.. కేజ్రీవాల్‌కు తీహార్ క్లబ్ (Teehar Club) స్వాగతం పలుకుతోందని చెప్పడంతో సీఎం విచారణ తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అని ఆప్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. పైగా ఇప్పటికే పలువురు నేతల అరెస్ట్‌లతో ఆప్ అట్టుడికిపోతోంది. ఇప్పుడు ఏకంగా కేజ్రీవాల్‌కే నోటీసులు రావడంతో ఏం జరుగుతుందో ఏంటో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకూ కేజ్రీవాల్ విషయంలో సుకేష్ చెప్పినవన్నీ అక్షరాలా నిజమయ్యాయి.

బీఆర్ఎస్‌లో టెన్షన్ ఎందుకంటే..!

కేజ్రీవాల్ తర్వాత సుకేష్ లేఖలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha). మొదటిసారి లెటర్‌లో కవిత పేరు ప్రస్తావించడం.. వెనువెంటనే ఆమె నుంచి స్ట్రాంగ్ రిప్లయ్ రావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అసలు సుకేష్ ఎవరు..? అతనితో తనకేంటి పరిచయం..? అని కవిత చెప్పడంతో తానెవరో తెలియదా..? అంటూ 15 కేజీల నెయ్యి పంపిన విషయం మొదలుకుని.. ‘కవితక్క’ (Kavithakka) అని సంబోదిస్తూ తాజాగా 12 పేజీల లేఖ రిలీజ్ చేయడం పెను సంచలనమే అయ్యింది. కవిత తన గురించి ఏం చెప్పారో.. బీఆర్ఎస్ నేతలు ఏమేం ప్రశ్నించారో..? వాటన్నింటికీ ఈ లేఖలో పూసగుచ్చినట్లుగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇవన్నీ అటుంచితే.. ఇప్పుడు సుకేష్ ఉంటున్న తీహార్ జైలుకు.. ‘తీహార్ క్లబ్‌’కు స్వాగతం అంటూ కవిత, కేజ్రీవాల్‌కు లేఖలో పేర్కొనడం అటు ఆప్‌లో.. ఇటు బీఆర్ఎస్‌లో టెన్షన్ పెరిగిపోయింది. పైగా కవితతో తాను ఇదిగో ఫలానా నంబర్ నుంచి మాట్లాడానని ఫోన్ నంబర్ కూడా రివీల్ చేయడం మరింత దుమారం రేపుతోంది. పైగా లిక్కర్ స్కామ్‌లో కవిత ఈడీకి సమర్పించిన ఫోన్లలో ఒక నంబర్.. ఇప్పుడు సుకేష్ రిలీజ్ చేసిన నంబర్ ఒక్కటే కావడంతో బీఆర్ఎస్‌లో ఆందోళన పెరిగిపోయిందని తెలుస్తోంది. అంతేకాదు పదే పదే కవితక్క.. కవితక్క అని లేఖలో సుకేష్ సంబోదించడం.. తీహార్ జైలుకు వెల్‌కమ్ అని చెప్పడం పెద్ద రచ్చయ్యేలానే ఉందని బీఆర్ఎస్ అనుకుంటోందట.

అప్పుడే అయిపోలేదు.. ఇంకా చాలానే ఉంది..!

ఇప్పటి వరకూ రెండు లేఖలను మాత్రమే సుకేష్ బయటపెట్టాడు. అయితే.. ఇంతటితో అయిపోలేదు.. మున్ముందు చాలానే ఉందని పరోక్షంగా సంకేతాలిచ్చాడు. తన దగ్గర ఇంకా మొత్తం 703 వాట్సాప్‌ చాట్స్‌ ఉన్నాయని అతను లేఖలో చెప్పడంతో ఎన్నెన్ని సంచలనాలు బయటపడతాయో అని బీఆర్ఎస్‌‌లో భయం మొదలైందట. మొత్తానికి చూస్తే.. సుకేష్ కీ కహానీ ఇప్పట్లో ముగిసేలా లేదు. రానున్నరోజుల్లో పెద్ద తలకాలయల పేర్లు బయటికొచ్చినా.. ఇంతకు మించి అరెస్ట్‌లు జరిగినా.. పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే త్వరలోనే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నుంచి నోటీసులు రావొచ్చేమో అని కూడా హస్తినలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది..? రానున్న రోజుల్లో ఇంకా ఎన్నెన్ని లేఖలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

కవిత గురించి సుకేష్ రిలీజ్ చేసిన లెటర్‌లో సంచలన విషయాలు.. ఏమేం ఉన్నాయంటే..

**************************

Sukesh Vs Kavitha : కవితపై సుకేష్ రిలీజ్ చేసిన లెటర్, స్క్రీన్ షాట్స్‌ను కాస్త నిశితంగా పరిశీలిస్తే..

*****************************

Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్ EOI బిడ్‌లో కీలక అప్డేట్.. ఇంత హడావుడి చేసిన తెలంగాణ చివరికి..

*****************************

Sukesh Vs Kavitha : కవితపై మరో సంచలన లేఖ రిలీజ్ చేసిన సుకేష్.. ఈసారి మొత్తం అన్నీ...

*****************************

Mallareddy Comedy : బాబోయ్.. మల్లారెడ్డి.. పాలు, పూలు, కూరగాయలు అమ్మడమే కాదు.. ఇంకా చాలానే చేశారుగా.. పగలబడి నవ్వే విషయం చెప్పిన కేటీఆర్..



Updated Date - 2023-04-15T23:03:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising