BJP and BRS : కారు-కమలం నిజంగానే కలిసిపోతాయా.. ఇన్ని అస్త్రాలున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడం వెనుక ఇంత కథుందా.. సడన్‌గా ఎందుకో ఇలా..!?
ABN, First Publish Date - 2023-05-26T19:11:11+05:30
తెలంగాణలో బీజేపీ (TS BJP) వైఖరి మారిందా..? మునపటిలా లేకుండా ఇప్పుడు పంథా పూర్తిగా మారిపోయిందా..? ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ-బీఆర్ఎస్ (BJP-BRS) రెండూ దగ్గరవుతున్నాయా..?
తెలంగాణలో బీజేపీ (TS BJP) వైఖరి మారిందా..? మునపటిలా లేకుండా ఇప్పుడు పంథా పూర్తిగా మారిపోయిందా..? ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ-బీఆర్ఎస్ (BJP-BRS) రెండూ దగ్గరవుతున్నాయా..? అందుకే ఈ మధ్య అటు బీజేపీని బీఆర్ఎస్.. బీఆర్ఎస్‌ను బీజేపీ విమర్శించుకోవట్లేదా..? మరీ ముఖ్యంగా మోదీ సర్కార్ అంటే ఒంటికాలిపై లేచే గులాబీ బాస్ కేసీఆర్ (KCR) ఇందుకే సైలెంట్ అయ్యారా..? తెలంగాణలో అవసరమైతే బీఆర్ఎస్సే గెలవాలే తప్ప కాంగ్రెస్ (TS Congress) మాత్రం అస్సలు గెలవకూడదని బీజేపీ కోరుకుంటోందా..? తెలంగాణలో (Telangana) గెలుపోటములు కంటే పార్టీ జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని బీజేపీ భావిస్తోందా..? అంటే ఇదే అక్షరాలా నిజమని అటు ఢిల్లీలో (Delhi) .. ఇటు తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామాలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య అసలేం నడుస్తోంది..? బీజేపీ మాస్టర్ ప్లానేంటి..? అధికారంలోకి వచ్చేస్తున్నాం.. రోజులు లెక్కపెట్టుకోండని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు సడన్‌గా ఎందుకు ఢీలా పడిపోయిందనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో చూద్దాం..
అసలేం జరుగుతోంది..!?
తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్‌కు అసలు సిసలైన ప్రధాన ప్రతిపక్షమన్నా, రెండో స్థానంలో ఉండేది ఏ పార్టీ అంటే.. కాంగ్రెస్సే అని రాజకీయ విశ్లేషకులు రాష్ట్ర ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఎప్పటికప్పుడు ఈ విషయాలను బీజేపీ ఖండిస్తూ.. తామే ప్రధాన ప్రతిపక్షమని అంతేకాదు రానున్న ఎన్నికల్లో గెలవబోతున్నామని కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కమలనాథులు చెప్పుకుంటూ వస్తున్నారు. కేసీఆర్ సర్కార్‌కు (KCR Govt) రోజులు దగ్గరపడ్డాయని కౌంట్ డౌన్‌తో కూడా బోర్డులు సైతం బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర దర్శనమిచ్చాయ్. అయితే ఇదంతా గతం.. ఇప్పుడు మొత్తం మారిపోయింది. తాము అధికారంలో రావడం సంగతి దేవుడెరుగు కానీ.. కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాకూడదని బీజేపీ భావిస్తోంది. ఇదంతా రాష్ట్రంలో ఉండే బీజేపీ నేతలు (BJP Leaders) అనుకుంటున్నారంటే తప్పులు కాలేసినట్లే.. కేంద్ర పెద్దలే భావిస్తున్నారని తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ నేతే ‘చిట్‌చాట్’లో చెప్పడం ఇప్పుడు వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు.. కేసీఆర్ వ్యతిరేక అంశం నిర్మించడంలో బండి సంజయ్ (Bandi Sanjay) విఫలమయ్యారని బీజేపీ నేతే చెబుతుండటం గమనార్హం. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రస్తుతానికి తెలంగాణ బీజేపీలోకి వలసలు మాత్రం అస్సలే ఉండవని.. ప్రస్తుతానికి వలసలు క్లోజ్ అయ్యాయని ఢిల్లీ వేదికగా చెప్పడం ఇప్పుడీ వ్యవహారంపైనే ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసినా బీజేపీ-బీఆర్ఎస్ గురించే చర్చించుకుంటున్నారు.
ఢిల్లీ వేదికగా బీజేపీ నేత ఏం మాట్లాడారు..!?
సడన్‌గా ఎందుకిలా..!?
దక్షిణాదిన పాగా వేయబోతున్నాం.. కర్ణాటకతో (Karnataka) మొదలై తెలంగాణ (Telangana) ఆ తర్వాత తమిళనాడు (Tamilnadu) వరకూ అంతా కాషాయమయం చేస్తామని కమలనాథులు తెగ డబ్బాలు కొట్టారు. ఇక డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేస్తోందని ఓ రేంజ్‌లో ఊదరగొట్టారు. సీన్ కట్ చేస్తే.. మిగిలిన రాష్ట్రాల సంగతి దేవుడెరుగు గానీ అధికారంలో ఉన్న కర్ణాటకలోనే ప్రభుత్వాన్ని కాపాడలేక.. ‘చేయి’ (కాంగ్రెస్) దెబ్బకు కమలం గుర్తుపట్టలేని రీతిలో వాడిపోయింది. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అప్పటి వరకూ ఎగిరెగిరి పడిన కమలనాథులు కనీసం ఈ ఫలితాల గురించి మాట్లాడటానికి కూడా ఏ మాత్రం సాహసం చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫలితాల దెబ్బకు కేంద్రం మొదలుకుని రాష్ట్ర కమలనాథులు ఢీలాపడిపోయారు. అందుకే కర్ణాటక తర్వాతి టార్గెట్ అయిన తెలంగాణలో ఇప్పుడు బీజేపీ పంథా సడన్‌గా మారిపోయింది. అందుకే ఇక వేరే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండే రాష్ట్రాల జోలికి పోకుండా మొదట ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలని బీజేపీ భావిస్తోందట. అంటే.. రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో వాటిపై మొదట ప్రత్యేక దృష్టి పెట్టి కాపాడుకోవాలని కమలనాథులు అనుకుంటున్నారట. ఇలా కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రంలో గెలుచుకుంటూ పోతే.. జాతీయస్థాయిలో అసలుకే ఎసరు వస్తుందని అందుకే అవసరమైతే ప్రత్యర్థులతో అయినా సరే చేతులు కలిపాలన్నది కేంద్రంలోని కమలనాథులు సిద్ధమైపోయారట. అందుకే ఈ ఫార్ములాను తెలంగాణలో బీఆర్ఎస్‌తో కలిసి అమలు చేయాలని ఉవ్విళ్లూతున్నారని క్లియర్ కట్‌గా అర్థమైపోయింది. అందుకే ఇలా ముందుగానే ఢిల్లీ వేదికగా జాతీయ నేతలతో ఇలా లీకులు ఇప్పించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఓహో ఇందుకేనా..!?
వాస్తవానికి ఇదంతా ప్రీప్లాన్ అన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఒకప్పుడు బీజేపీ అంటే ఒంటికాలిపై లేచే కేసీఆర్ ఈ మధ్య మోదీ తీసుకునే నిర్ణయాలపై, కన్నడనాట ఫలితాలపై మరీ ముఖ్యంగా రెండు వేల రూపాయిల నోట్ల రద్దుపై అస్సలు స్పందించకపోవడంతో అందరికీ అనుమానాలే వస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే నాడు కొత్త సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను (TS Governer) పిలవలేదని బీజేపీ నేతలు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ నానా రచ్చ చేసిన విషయం అందిరికీ తెలిసే ఉంటుంది. అప్పట్లో బీజేపీకి ఇదొక అస్త్రం.. ఇప్పుడు కేసీఆర్ చేతుల్లోనూ ఒక అస్త్రం ఉంది. ఎలాగంటే.. కొత్త పార్లమెంట్ భవనం (New Parliament Building) రాష్ట్రపతి (President) చేతులు ప్రారంభించట్లేదు.. అంతేకాదు కనీసం ప్రారంభోత్సవానికి ఆహ్వానం కూడా లేదు.. దీన్ని బీఆర్ఎస్ ఒక సువర్ణావకాశంగా తీసుకోవచ్చు.. కానీ ఎందుకో ఈ విషయాన్ని కేసీఆర్ అస్సలు పట్టించుకోలేదు. ఈ మధ్య జరుగుతున్న వరుస పరిణామాలను చూస్తుంటే.. ‘ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ (Abki Bar Kisan Sarkar)ఇప్పుడెందుకిలా సైలెంట్ అయ్యారనే సందేహాలు కచ్చితంగా సందేహాలొస్తాయ్. అయితే దీన్ని కేసీఆర్ వ్యూహాత్మక మౌనమా..? అంతా ప్రీ-ప్లానా అన్నది మాత్రం అర్థం కాని పరిస్థితి. మరోవైపు.. కల్వకుంట్ల కవితను (Kalvakuntla Kavitha) ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) నుంచి గట్టెక్కించుకోవడానికే బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం జరిగిందనే ప్రచారం లేకపోలేదు. ఈ మొత్తం వ్యవహారంపై బీఆర్ఎస్ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మొత్తానికి చూస్తే.. తెలంగాణలో గెలుపోటముల కంటే పార్టీ జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని బీజేపీ భావిస్తోందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పుంజుకుంటే మాత్రం అసలుకే ఎసరు వస్తుందన్నది బీజేపీ వ్యూహాత్మకంగా ఇలా అడుగులేస్తోందని దీన్ని బట్టి తెలుస్తోంది. ఇంత జరిగిన తర్వాత అటు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాలి మరి.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
TS BJP : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై ఫుల్ క్లారిటీ.. రేవంత్ రెడ్డిపై ఈటలకు ఇంత ప్రేమేంటో.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!?
******************************
TS Politics : హవ్వా.. నిజంగానే ఈటల రాజేందర్ బీజేపీని ఇన్ని మాటలు అన్నారా.. ఒకవేళ ఇదేగానీ...!
******************************
Dimple Vs DCP : డింపుల్ హయాతీ వర్సెస్ డీసీపీ ఎపిసోడ్‌లో రెండు నెలలుగా అసలేం జరిగింది.. హీరోయిన్ ఏం చేయబోతున్నారు..!?
******************************
New Parliament Building : రాష్ట్రపతిని పక్కనెట్టి మరీ మోదీ చేతుల మీదుగానే ఎందుకు..? నాడు తిట్టిపోశారుగా.. ఇప్పుడు చేస్తున్నదేంటో..!?
******************************
YS Avinash Vs CBI : నిన్న రెచ్చిపోయారు.. ఇవాళ సెంటిమెట్‌తో కొడుతున్నారు..రేపేంటో.. బాబోయ్ మాములు కథ కాదే..!
******************************
YSRCP : వైసీపీ ఎమ్మెల్యేకు వెరైటీ స్వాగతం.. అవాక్కయిన అధిష్టానం.. ఈ కామెంట్స్ విన్నాక మీరేమంటారో..!
******************************
Updated Date - 2023-05-26T19:26:56+05:30 IST