MLC Kavitha ED Enquiry : ఎక్కడ చూసినా కవిత ఫోన్ల గురించే చర్చ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పాత కామెంట్స్.. అసలేమన్నారంటే..
ABN, First Publish Date - 2023-03-21T19:35:39+05:30
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case ) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) పదుల సంఖ్యలో మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case ) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) పదుల సంఖ్యలో మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారు.. ఆమె ఏ తప్పూ చేయకపోతే ఎందుకు ధ్వంసం చేశారు.. నిజానిజాలు బయటికి వస్తాయనే ముందే గ్రహించి ఇలా చేశారు.. ఇవీ ప్రతిపక్ష పార్టీ నేతలు, ఈడీ అధికారుల నుంచి వచ్చిన ఆరోపణలు, అభియోగాలు. ఈ లిక్కర్ స్కామ్ బయటికొచ్చినప్పట్నుంచీ మంగళవారం ఉదయం 11 గంటల వరకూ ఇదే చర్చ. అయితే ఈడీ విచారణలో మొదటి రోజే కవిత వ్యక్తిగత ఫోన్‌ను (Kavitha Personal Phone) స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు.. మిగిలిన ఫోన్ల సంగతేంటి..? అని అధికారులు ఆరాతీశారు. సీన్ కట్ చేస్తే.. మూడోరోజు విచారణకు వెళ్తూ.. వెళ్తూ సీల్డ్ కవర్‌లో ఈడీ అడిగిన ఫోన్లను మీడియాకు చూపించారు కవిత. దీంతో ఫోన్లను ధ్వంసం చేయలేదనే విషయం క్లియర్ కట్‌గా కవిత చెప్పేశారు. అలా మీడియాకు చూపడమే కాదు.. ఫోన్ల గురించి తనపై ఈడీ చేసిన ఆరోపణలను కవిత తీవ్రస్థాయిలో ఖండించారు. విచారణకు వెళ్లక ముందే ఈ ఫోన్ల ధ్వంసం వ్యవహారంపై ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కవిత సంచలన లేఖ రాశారు. ఈ లేఖలో ఈడీ తనపై చేసిన ఆరోపణలేంటి..? లేఖ పూర్వకంగా కవిత ఇచ్చిన కౌంటరేంటి..? అనే విషయాలను స్పష్టంగా వివరించారు.
ఒకరిపై ఒకరు..!
ఈడీ ఆరోపించడం, కవిత మీడియాకు ఫోన్లు చూపించడం ఈ విషయాలన్నీ పక్కనెడితే.. లిక్కర్ స్కామ్‌లో కవిత ఆరోపణలు రావడంతో అసలు ఇదివరకూ ఇంటర్వ్యూల్లో ఫోన్ల గురించి కవిత ఏం మాట్లాడారు..? అసలు అన్ని ఫోన్లు వాడినట్లు చెప్పారా..? లేకుంటే అస్సలే వాడలేదని చెప్పారా..? అని గూగుల్, యూట్యూబ్‌లో జనాలు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక కవిత మాట్లాడిన విషయాలను బీఆర్ఎస్ శ్రేణులు ఇదిగో అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుండగా.. ఇక ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు, వీరాభిమానులు అయితే ఇంటర్వ్యూల్లో చేసిన కామెంట్స్‌ను ప్రస్తావించి మరీ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఇంతకీ ఇంటర్వ్యూల్లో కవిత ఏమన్నారు..!?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు బయటికి రాగానే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో పాటు పలు ప్రముఖ చానెల్స్‌కు కవిత ఇంటర్వ్యూలు ఇచ్చారు. సరిగ్గా అప్పుడే కవిత 10 ఫోన్లు ధ్వంసం చేశారని వార్తలు రావడంతో అసలు ఇందులో నిజానిజాలెంత అనే విషయంపై కవితకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘ అవును నేను పది ఫోన్లు వాడిన విషయం వాస్తవమే. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. అయ్యో నేను ఏ ఒక్క ఫోన్‌ను ధ్వంసం చేయలేదు. ఒక ఫోన్ నా కుక్ దగ్గర ఉంటుంది. ఇంకో ఫోన్ మా కార్యకర్తల దగ్గర ఉంటుంది. మరొకటి మా తోడు కోడలుకు చిన్న క్యూట్ శాంసంగ్ ఫోన్ ఇచ్చాను. ఇలా శాంసంగ్, ఐఫోన్ ఇలా కొత్త ఫోన్ వర్షన్‌లు వచ్చినప్పుడు నేను మామూలుగానే కొంటూ ఉంటాను. ఈడీ చెప్పిన ఫోన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈడీ అధికారులు ఏ ఐఎంఈఐ నంబర్లతో అడుగుతున్నారో ఆ ఫోన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు తీసుకురమ్మన్నా తీసుకొస్తాను.. ఇందులో ఎలాంటి సందేహాలు, అనుమానాలు అక్కర్లేదు. లిక్కర్ స్కామ్ కేసు అంతా ఫేక్. ఈ కేసులో త లేదు, తోక లేదు. అసలు ఈ విచారణ ఎందుకు చేస్తున్నామో ఏమో కూడా అధికారులకే అర్థం కావట్లేదు. పై నుంచి ఫోన్ రావాలి.. వీళ్లు ఇక్కడ విచారణ చేయాలి. పైనుంచి కవిత పిలవాలని ఫోన్ వస్తుందో అప్పుడు విచారణకు పిలుస్తారు.. లేకపోతే లేదు. నేను విచారణకు వెళ్లినా అధికారులకు అన్నివిధాలుగా సహకరిస్తాను. ఎలాంటి ప్రశ్నలు అడిగినా అన్నింటికీ సమాధానం చెబుతాను’ అని ఓ ఇంటర్వ్యూలో కవిత పేర్కొన్నారు.
ఇప్పుడు ఏమంటున్నారు..!?
ఇవాళ ఈ మొబైల్ ఫోన్స్ గురించి ఈడీ అధికారులకు సంచలన లేఖే రాశారు. ‘నేను విచారణకు సహకరిస్తున్నాను. ఈడీ దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నాను. ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా.. ?. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ధ్వంసం చేశానని పేర్కొంది. నాకు సమన్లు కూడా ఇవ్వకుండానే.. కనీసం అడగకుండానే ఏ పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది?. నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం. అందుకే నా పాత ఫోన్లన్నీ ఈడీ అధికారులకే ఇచ్చేస్తున్నాను’ అని లేఖలో కవిత పేర్కొన్నారు. మొత్తానికి చూస్తే.. ఫోన్లను ధ్వంసం చేయలేదన్న విషయాన్ని ఇలా తన పాత ఫోన్లన్నీ మీడియా ముందే చూపించడంతో పాటు.. ఈడీకి ఇచ్చి కవిత నిరూపించారు. అంతేకాదు.. మార్చిలో విచారణకు పిలవడం.. నవంబర్‌లోనే ఫోన్లను ధ్వంసం చేశారని చెప్పడమేంటని గట్టి లాజిక్‌తోనే కవిత ఈడీని కొట్టారని నిపుణులు చెబుతున్నారు.
మొత్తానికి చూస్తే.. కవిత అప్పట్లో ఫోన్ల గురించి ఏం మాట్లాడారో.. ఇప్పుడు కూడా అవే మాటలు కవిత మాట్లాడుతున్నారు. పైగా ఆధారాలతో సహా తాను ఫోన్లు ధ్వంసం చేయలేదని మీడియా ముందే వాటిని చూపించారు. మరి ఇదివరకే ఈడీ అధికారులు ఫోన్ నంబర్లు, ఐఎంఈఐ నంబర్లు పక్కా ఆధారాలతో రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు కవిత ఈడీ అధికారులకు సమర్పించిన ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు మ్యాచ్ అయ్యాయా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
MLC Kavitha ED Enquiry : కవిత మీడియాకు చూపించిన మొబైల్ ఫోన్లను కాస్త జూమ్ చేస్తే...!!
******************************
MLC Kavitha ED Enquiry : విచారణలో రివర్స్ అటాక్.. కవిత ప్రశ్నలకు ఈడీ అధికారులు నీళ్లు నమిలారా.. కొసమెరుపు ఏమిటంటే..!
******************************
Kavitha ED Enquiry : విచారణకు వెళ్లే ముందు ఈడీకి కవిత సంచలన లేఖ.. ఇందులో లాజిక్ ఏమిటంటే..?
******************************
Kavitha ED Enquiry : ఈడీ విచారణకు వెళ్తూ పాత ఫోన్లు చూపించిన కవిత.. బీఆర్ఎస్ శ్రేణుల్లో పెరిగిపోయిన టెన్షన్..
******************************
MLC Kavitha ED Enquiry : విచారణకు వెళ్లే ముందు కవిత కీలక సమావేశం.. ఈడీ ఆఫీసు చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు.. కీలక పరిణామాలుంటాయా..!?
******************************
Updated Date - 2023-03-21T19:54:06+05:30 IST